కృత్రిమ కల్లు దందాలో ఆధిపత్య పోరు

దిశ ప్రతినిధి, నిజామాబాద్:   కొత్త మామ్లా (డిపోల్లో కల్లు తయారీ, అమ్మకాలు) దసరా పండుగకు షురూ అయ్యాయో లేదో అప్పుడే గొడవలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఇందూర్ నగరమే కల్తీ కల్లు తయారీకి ప్రధాన కేంద్రం. ఎక్సైజ్, పోలీస్ శాఖలను మేనేజ్ చేసి నిషేధిత మత్తు పదార్థాలను కలిపి నీటితోనే కల్తీ కల్లు(కృత్రిమ) తయారీ బహిరంగ రహస్యమిక్కడ. ఆ దందాతో కోట్లకు పడగలెత్తిన వారున్నారు. దీంతో ఈ దందా అంటే అందరికీ మక్కువే. వంద […]

Update: 2020-11-04 01:01 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కొత్త మామ్లా (డిపోల్లో కల్లు తయారీ, అమ్మకాలు) దసరా పండుగకు షురూ అయ్యాయో లేదో అప్పుడే గొడవలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఇందూర్ నగరమే కల్తీ కల్లు తయారీకి ప్రధాన కేంద్రం. ఎక్సైజ్, పోలీస్ శాఖలను మేనేజ్ చేసి నిషేధిత మత్తు పదార్థాలను కలిపి నీటితోనే కల్తీ కల్లు(కృత్రిమ) తయారీ బహిరంగ రహస్యమిక్కడ. ఆ దందాతో కోట్లకు పడగలెత్తిన వారున్నారు. దీంతో ఈ దందా అంటే అందరికీ మక్కువే.

వంద చెట్లు కూడా లేని ఇందూర్ నగరంలో మూడు కల్లు డిపోలు ఉండడం, నగరంతో పాటు చుట్టు పక్కల కొన్ని గ్రామాలకు కల్లు సరఫరా జరగడం చూస్తేనే దందా ఏ రేంజ్లో నడుస్తుందో తెలుసుకోవచ్చు. డిపోలన్నీ సొసైటీల ఆధ్వర్యంలో నడవ డం, ఆదాయం వైన్స్లకు తీసిపోకపోవడంతో అందరి చూపు అటువైపే. పైగా, కల్లు డిపోల్లోకి గీత వృత్తి పేరు చెప్పుకుని బయటి వ్యక్తులు రంగప్రవేశం చేయడంతో కల్తీకి కొదవ లేకుండా పోతోంది. గీత వృతి పనివారని సభ్యులుగా చేర్చుకుని సొసైటీల పేరుతో డిపోలను ఏ ర్పాటు చేసి కల్తీ దందాను విచ్చలవిడిగా నడుపుతున్నారు. దందాలో అధికార పార్టీ నేతల భాగస్వామ్యమే అధికం. కృత్రిమ కల్లు తయారీ దందాలో రాజకీయ పలుకుబడి, వ్యాపారవేత్తల ప్రవేశంతో ఆధిపత్య పోరు సాధారణమయ్యాయి.

ఈ దసరాకు కొత్త మామ్లా ప్రారంభమై అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో గ్రూపు రాజకీయాలు బహిర్గతమయ్యాయి. అయితే సొసైటీ సభ్యులపై ఎక్సైజ్ అధికారులు కేసులు నమోదు చేయడం, దాని వెనక లీడర్ల ప్రమేయముందని తెలియడంతో గొడవలు ఎక్కువయ్యాయి. ఒక దశలో లైసెన్స్లు రద్దు చేసి మళ్లీ కొత్తగా పిలవాలనే స్థాయికి డిమాండ్ వెళ్లింది. అదే డి మాండ్తో అటు కలెక్టర్కు, ఇటు ఆబ్కారీ శాఖకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో సభ్యులు ధర్నాలకు దిగుతున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు ఫలిస్తాయా.. లేక కొత్త పాలక వర్గాలకు అవకాశం వెళ్లనుందా అని ఇప్పుడు జిల్లావ్యాప్తంగా జరుగుతున్న చర్చ.

Tags:    

Similar News