గీతం ఆధ్వర్యంలో ఎఫ్‌డీపీ …ఎప్పుడంటే..

దిశ, పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఆధ్వర్యంలో నవంబర్ 2 నుంచి 6 తేదీ వరకు వాతావరణ మార్పులు, సానుకూల నిర్మాణ విజ్ఞానం అనే అంశంపై ఐదు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమం(ఎఫ్ డీపీ) నిర్వహించనున్నట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ సుశీల్ కుమార్ వెల్లడించారు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) శిక్షణ, అభ్యాసం మండలి (ఏటీఏఎల్) సౌజన్యంతో దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా నిర్మాణం, అవకాశాలు, మార్గాలపై ఈ […]

Update: 2020-10-23 11:02 GMT

దిశ, పటాన్‌చెరు:
గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఆధ్వర్యంలో నవంబర్ 2 నుంచి 6 తేదీ వరకు వాతావరణ మార్పులు, సానుకూల నిర్మాణ విజ్ఞానం అనే అంశంపై ఐదు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమం(ఎఫ్ డీపీ) నిర్వహించనున్నట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ సుశీల్ కుమార్ వెల్లడించారు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) శిక్షణ, అభ్యాసం మండలి (ఏటీఏఎల్) సౌజన్యంతో దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా నిర్మాణం, అవకాశాలు, మార్గాలపై ఈ కార్యక్రమంలో విశదీకరిస్తారని ప్రొఫెసర్ సునీల్ తెలిపారు. ఇందులో పాల్గొనే వారికి ఎటువంటి రుసుము లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో 80 శాతం హాజరు, 60 శాతం మార్కులు సాధించిన వారికి ఏఐసీటీఈ, ఏఐసీఏల్ అకాడమి నుంచి ఈ-సర్టిఫికెట్ ప్రదానం చేస్తారని తెలిపారు. ఆర్కిటెక్చర్, ఇంజినీరింగ్ లతో పాటు మేనేజ్ మెంట్ అధ్యాపకులు, ఇతరులు కూడా ఈ ఆధ్యాపక వికాస కార్యక్రమంలో పాల్గొనవచ్చన్నారు. ఉచిత రుసుముతో https://atalacademy.aicte-india.org/signupలో పేర్లను నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఇతర వివరాల కోసం కార్యక్రమ సమన్వయకర్త హేమశ్రీ రాళ్ళపల్లిని మొబైల్ నెంబర్ 9908874594 పై సంప్రదించాలని లేదా hema.rallapalli@gitam.edu కు ఈ-మెయిల్ చేయాలని ప్రొఫెసర్ సునీల్ సూచించారు.

Tags:    

Similar News