ఫాస్టాగ్ నిబంధనలు..ఏప్రిల్ 2నుంచి డబుల్ ఫైన్లు..

తెలంగాణలోని ఓఆర్ఆర్‌పై ఫాస్టాగ్ నిబంధనలు మరింత కఠినతరం కానున్నాయి. ఈ నెల15నుంచి వాటిని సీరియస్‌గా అమలు చేయుటకు రంగం సిద్ధం చేశామని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌‌జీసీఎల్) నిర్ణయించింది. ఇప్పటికే ఈ నిబంధనలు అమలులో ఉన్నప్పటికి వాహనదారుల నుంచి వచ్చిన సూచనల ఫాస్టాగ్ లేని వారు 158కిలో మీటర్ల పరిధిలోని ఓఆర్ఆర్ పై డెడికేటెడ్(బ్లూలెన్ మార్గం)లో మాత్రమే ప్రయాణించాలన్నారు. ఫాస్టాగ్ ఉన్నవారు మాత్రం డెడికేటెడ్(ఆరెంజ్ కలర్ మార్గం)లో వెళ్లాలి. బ్లూలెన్ మార్గంలో వెళ్లాల్సిన వారు అనగా […]

Update: 2020-03-13 10:55 GMT
ఫాస్టాగ్ నిబంధనలు..ఏప్రిల్ 2నుంచి డబుల్ ఫైన్లు..
  • whatsapp icon

తెలంగాణలోని ఓఆర్ఆర్‌పై ఫాస్టాగ్ నిబంధనలు మరింత కఠినతరం కానున్నాయి. ఈ నెల15నుంచి వాటిని సీరియస్‌గా అమలు చేయుటకు రంగం సిద్ధం చేశామని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌‌జీసీఎల్) నిర్ణయించింది. ఇప్పటికే ఈ నిబంధనలు అమలులో ఉన్నప్పటికి వాహనదారుల నుంచి వచ్చిన సూచనల ఫాస్టాగ్ లేని వారు 158కిలో మీటర్ల పరిధిలోని ఓఆర్ఆర్ పై డెడికేటెడ్(బ్లూలెన్ మార్గం)లో మాత్రమే ప్రయాణించాలన్నారు. ఫాస్టాగ్ ఉన్నవారు మాత్రం డెడికేటెడ్(ఆరెంజ్ కలర్ మార్గం)లో వెళ్లాలి. బ్లూలెన్ మార్గంలో వెళ్లాల్సిన వారు అనగా (ఫాస్టాగ్ లేని వారు) ఈ మధ్య ఆరెంజ్ మార్గం నుంచి వెళ్తున్నారు. దీంతో ఫాస్టాగ్ తీసుకున్నవాహనదారుల నుంచి ఫిర్యాదు వెల్లువెత్తడంతో నిబంధనలు కఠినతరం చేసినట్టు హెచ్‌‌జీసీఎల్ పేర్కొంది. ఏప్రిల్ 2నుంచి (నాన్ ఫాస్టాగ్)వాహనదారులు బ్లూ లెన్ల నుంచి కాకుండా ఆరెంజ్ మార్గం నుంచి ప్రయాణించినట్టయితే వారికి డబుల్ చార్జీలు వసూలు చేయనున్నట్టు తెలిపారు.

Tags: fastag orange line, non fastag blueline, double fine, hgcl

Tags:    

Similar News

Expand player