రైలు రోకో.. తగ్గేదే లేదంటున్న రైతులు
న్యూఢిల్లీ : కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల సంఘాలు రైలు రోకోకు పిలుపునిచ్చాయి. గురువారం మధ్యాహ్నం 12గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు దేశ వ్యాప్తంగా రైల్ రోకో ఆందోళన్ చేపట్టాలని భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేశ్ తికాయత్ పేర్కొన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్రజలు తమతమ గ్రామాల పరిధిలో రైల్ రోకోలో పాల్గొంటారని తెలిపారు. రైతు సంఘాల పిలుపుతో రైల్వేశాఖ అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా 20 కంపెనీల రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ […]
న్యూఢిల్లీ : కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల సంఘాలు రైలు రోకోకు పిలుపునిచ్చాయి. గురువారం మధ్యాహ్నం 12గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు దేశ వ్యాప్తంగా రైల్ రోకో ఆందోళన్ చేపట్టాలని భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేశ్ తికాయత్ పేర్కొన్నారు.
సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్రజలు తమతమ గ్రామాల పరిధిలో రైల్ రోకోలో పాల్గొంటారని తెలిపారు. రైతు సంఘాల పిలుపుతో రైల్వేశాఖ అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా 20 కంపెనీల రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్(ఆర్‌పీఎస్‌ఎఫ్)ను రంగంలోకి దింపింది. ముఖ్యంగా పంజాబ్, హర్యానా, పశ్చిమబెంగాల్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.