రోడ్డెక్కిన రైతులు.. 25 రోజులైందంటూ ఆగ్రహం

దిశ, దుబ్బాక: తూకం వేసిన ధాన్యాన్ని లారీల్లో తరలించాలంటూ రైతులు రోడ్డెక్కారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని ఐకేపీ కేంద్రం ఎదుట సోమవారం రైతులు నిరసన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి 25 రోజులు గడుస్తున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదంటూ అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీలు, హమాలీల కొరత తీవ్రంగా ఉందని, అయినా.. అధికారులు పట్టించుకోకపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిన పోలీసులు ఘటనా […]

Update: 2021-06-07 05:01 GMT

దిశ, దుబ్బాక: తూకం వేసిన ధాన్యాన్ని లారీల్లో తరలించాలంటూ రైతులు రోడ్డెక్కారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని ఐకేపీ కేంద్రం ఎదుట సోమవారం రైతులు నిరసన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి 25 రోజులు గడుస్తున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదంటూ అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీలు, హమాలీల కొరత తీవ్రంగా ఉందని, అయినా.. అధికారులు పట్టించుకోకపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, రైతులతో మాట్లాడారు. లారీల కొరత ఉందని రైతులు అధికారుల ముందు వాపోయారు. ధాన్యాన్ని ఇక్కడి నుంచి తరలించే వరకూ ఆందోళన విరమించేది లేదని బైటాయించారు. విషయం తెలిసిన తహసీల్దార్ సుజాత ధాన్యాన్ని లారీల్లో తరలిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Tags:    

Similar News