నిజామాబాద్‌లో రైతులకు తీవ్ర ఇబ్బందులు
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలో రోడ్లపై, గంజ్‌లో కూరగాయలు విక్రయించే రైతుల, విక్రేతల పొట్ట కొడుతున్నారు హోల్ సేల్, రిటైల్ వ్యాపారులు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టు బాటు ధర దక్కకుండా చేసే దళారులు( కమీషన్ ఏజెంట్లు, హోల్ సేల్ వ్యాపారులు) వారిని కనీసం రోడ్లపై, గంజ్‌లో చిల్లరగా కూరగాయలను విక్రయించకుండా చేస్తున్నారు. అది కూడా మార్కెట్ బంద్ ఉండే శనివారం రైతులకు, కురగాయాలు విక్రయించి కుటుంబాలను పోషించుకునేవారికి తిప్పలు తప్పడం లేదు. హోల్ […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలో రోడ్లపై, గంజ్‌లో కూరగాయలు విక్రయించే రైతుల, విక్రేతల పొట్ట కొడుతున్నారు హోల్ సేల్, రిటైల్ వ్యాపారులు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టు బాటు ధర దక్కకుండా చేసే దళారులు( కమీషన్ ఏజెంట్లు, హోల్ సేల్ వ్యాపారులు) వారిని కనీసం రోడ్లపై, గంజ్‌లో చిల్లరగా కూరగాయలను విక్రయించకుండా చేస్తున్నారు. అది కూడా మార్కెట్ బంద్ ఉండే శనివారం రైతులకు, కురగాయాలు విక్రయించి కుటుంబాలను పోషించుకునేవారికి తిప్పలు తప్పడం లేదు. హోల్ సేల్ మార్కెట్ శ్రద్ధ నంద్ గంజ్‌లో ఉండటంతో, గాంధీ గంజ్‌లో రిటైల్ విక్రయాలు జరుగుతుంటాయి. దీంతో పాటు గంజ్ కమాన్ నుంచి దేవి మందిరం చౌరస్తా వరకు రోడ్డుకు ఇరువైపుల రైతులు, రిటైల్ చిల్లర కూరగాయల విక్రయదారులు అమ్ముతుంటారు. ప్రతి శనివారం హోల్ సేల్ మార్కెట్‌కు సెలవు ఉంటే ఆ రోజు సైతం రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.
నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో కూరగాయల హోల్ సేల్ దందా జరుగుతున్నది. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ లైసెన్స్ కలిగిన 90 మంది వరకు హోల్ సేల్ వ్యాపారులు అమ్మకాలు చేస్తున్నారు. రైతులు తాము స్వతహగా పండించిన పంటలను అమ్ముకుందామంటే అక్కడ అమ్మకానికి అడ్డంకులు తప్పడం లేదని వాపోతున్నారు. వాటిని విక్రయాలు చెయ్యాలంటే సవాలక్ష అడ్డంకులు ఉంటున్నాయని చెబుతున్నారు. కనీసం శనివారం కూడా మార్కెట్‌లో తాజా కూరగాయలను తక్కువ ధరకు అమ్ముకోవాలన్నా.. హోల్ సేల్ వ్యాపారులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మార్కెట్ కమిటీ అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకొని వారికి దారి చూపించాలని కోరుతున్నారు.