కలెక్టరేట్ ఎదుట రైతు ఆమరణ దీక్ష..!

దిశప్రతినిధి, ఆదిలాబాద్: ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకుంటే డబ్బులు ఇవ్వకుండా, పంచుకు తిన్నారని ఆరోపిస్తూ ఓ రైతు జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆమరణ నిరాహార దీక్షకు దిగాడు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం ఆలూరుకు చెందిన రాజేశ్వర్ అనే రైతు గత సీజన్‎లో పండించిన వరి ధాన్యాన్ని డీసీఎంఎస్ సెంటర్‎లో అమ్ముకున్నాడు. కొనుగోలు కేంద్రంలో తన ధాన్యం నుంచి తరుగు పేరిట కొనుగోలుదారు మోసం చేయడమే కాకుండా, 20 క్వింటాళ్ళ ధాన్యం డబ్బులు ఇవ్వలేదని రైతు […]

Update: 2020-09-07 09:56 GMT

దిశప్రతినిధి, ఆదిలాబాద్: ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకుంటే డబ్బులు ఇవ్వకుండా, పంచుకు తిన్నారని ఆరోపిస్తూ ఓ రైతు జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆమరణ నిరాహార దీక్షకు దిగాడు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం ఆలూరుకు చెందిన రాజేశ్వర్ అనే రైతు గత సీజన్‎లో పండించిన వరి ధాన్యాన్ని డీసీఎంఎస్ సెంటర్‎లో అమ్ముకున్నాడు.

కొనుగోలు కేంద్రంలో తన ధాన్యం నుంచి తరుగు పేరిట కొనుగోలుదారు మోసం చేయడమే కాకుండా, 20 క్వింటాళ్ళ ధాన్యం డబ్బులు ఇవ్వలేదని రైతు ఆరోపించారు. గతంలో ఈ విషయమై జాయింట్ కలెక్టర్‎కు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోలేదని వాపోయారు. తనకు వెంటనే డబ్బులు ఇప్పించాలని.. తనకు న్యాయం జరిగే వరకు ఆమరణ దీక్ష కొనసాగిస్తానని రైతు స్పష్టం చేశారు.

Tags:    

Similar News