అయ్యో రైతు.. వ‌డ్లు కొన‌డం లేద‌ని ఇంత పని చేశావా..

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : ధాన్యం కొనే దిక్కు క‌నిపించ‌క‌పోవ‌డంతో ఓ రైతు పురుగుల‌మందు తాగి ఆత్మహ‌త్యకు పాల్పడ్డాడు. ఈ సంఘ‌ట‌న ములుగు జిల్లా ఏటూరునాగారం మండ‌లం శివ‌పురం గ్రామంలో జ‌రిగింది.  గ్రామానికి చెందిన   దేవంపల్లి శివ కుమార్(52)  ఏడెక‌రాల్లో వ‌రి సాగు చేశాడు. ఇందులో రెండెక‌రాల సొంత భూమి కాగా, మిగ‌తా ఐదెక‌రాలు కౌలుకు తీసుకున్నాడు. అయితే గ‌త రెండేళ్లుగా న‌ష్టాలు ప‌ల‌క‌రించాయి.  పంట దిగ‌బ‌డి లేక‌, పెట్టుబ‌డికి వ‌చ్చే రాబ‌డికి పొంత‌న లేక‌పోవ‌డంతో […]

Update: 2021-12-01 03:56 GMT

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : ధాన్యం కొనే దిక్కు క‌నిపించ‌క‌పోవ‌డంతో ఓ రైతు పురుగుల‌మందు తాగి ఆత్మహ‌త్యకు పాల్పడ్డాడు. ఈ సంఘ‌ట‌న ములుగు జిల్లా ఏటూరునాగారం మండ‌లం శివ‌పురం గ్రామంలో జ‌రిగింది. గ్రామానికి చెందిన దేవంపల్లి శివ కుమార్(52) ఏడెక‌రాల్లో వ‌రి సాగు చేశాడు. ఇందులో రెండెక‌రాల సొంత భూమి కాగా, మిగ‌తా ఐదెక‌రాలు కౌలుకు తీసుకున్నాడు. అయితే గ‌త రెండేళ్లుగా న‌ష్టాలు ప‌ల‌క‌రించాయి. పంట దిగ‌బ‌డి లేక‌, పెట్టుబ‌డికి వ‌చ్చే రాబ‌డికి పొంత‌న లేక‌పోవ‌డంతో అప్పుల పాల‌య్యాడు. ఈ సారి పంట‌పై ఆశ‌లు పెట్టుకున్నా చేదు అనుభ‌వమే ఎదురైంది.

పంట దిగుబ‌డి దారుణంగా ప‌డిపోవడంతో పాటు ధాన్యం కొనే దిక్కు క‌నిపించ‌డం లేద‌ని మ‌న‌స్తాపం చెంది, మంగ‌ళ‌వారం రాత్రి ఎనిమిది గంట‌ల స‌మ‌యంలో వ‌రి ధాన్యం కుప్ప వ‌ద్దకు వెళ్లిన కుమార్ తన వెంట తీసుకెళ్లిన పురుగుల మందు తాగాడు. కొద్దిసేప‌టికి విష‌యం గ‌మ‌నించిన కుటుంబ స‌భ్యులు ములుగు ఆస్పత్రికి అక్కడి నుంచి వ‌రంగ‌ల్ ఎంజీఎంకు త‌ర‌లించారు. అయితే ప‌రిస్థితి విష‌మించ‌డంతో బుధ‌వారం కుమార‌స్వామి క‌న్నుమూశాడు. కుమార‌స్వామి మృతితో గ్రామ రైతులంతా క‌న్నీరుమున్నీర‌వుతున్నారు. ఎవుసం ఎందుకు చేయాలంటూ ఆవేద‌న చెందుతున్నారు.

Tags:    

Similar News