సోనూ, అక్షయ్‌లే భారత రత్నాలు..
సోనూసూద్.. లాక్‌డౌన్‌లో రియల్ హీరో అనిపించుకున్నాడు. వలస కార్మికులను సొంతూర్లకు చేర్చేందుకు ఆయన హృదయపూర్వకంగా చేసిన సేవలు ప్రతీ ఒక్క భారతీయుడి ప్రశంసలు అందుకున్నాయి. కేవలం బస్, భోజన సౌకర్యం కల్పించి కూలీలను ఇంటికి చేర్చడం మాత్రమే కాదు.. ఇందుకోసం హెల్ప్‌లైన్ నంబర్‌ను కూడా లాంచ్ చేసి తన సేవలు కొనసాగిస్తున్నాడు సోనూ. కేరళలో చిక్కుకున్న 150 మంది మహిళలను ఒడిశాకు చేర్చేందుకు ఫ్లైట్ కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇక అక్షయ్ కుమార్.. సంపాదించిన […]
సోనూసూద్.. లాక్‌డౌన్‌లో రియల్ హీరో అనిపించుకున్నాడు. వలస కార్మికులను సొంతూర్లకు చేర్చేందుకు ఆయన హృదయపూర్వకంగా చేసిన సేవలు ప్రతీ ఒక్క భారతీయుడి ప్రశంసలు అందుకున్నాయి. కేవలం బస్, భోజన సౌకర్యం కల్పించి కూలీలను ఇంటికి చేర్చడం మాత్రమే కాదు.. ఇందుకోసం హెల్ప్‌లైన్ నంబర్‌ను కూడా లాంచ్ చేసి తన సేవలు కొనసాగిస్తున్నాడు సోనూ. కేరళలో చిక్కుకున్న 150 మంది మహిళలను ఒడిశాకు చేర్చేందుకు ఫ్లైట్ కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ఇక అక్షయ్ కుమార్.. సంపాదించిన సొమ్ము నా ప్రజలకు అవసరమైన సమయంలో పనికి రానప్పుడు దానికి విలువ ఏముంది? అంటూ కరోనా వ్యాప్తిని అరికట్టడానికి భారీ విరాళం అందించాడు. ఆ తర్వాత కరోనా వారియర్స్.. డాక్టర్లు, మున్సిపల్ వర్కర్లు, పోలీసులకు కూడా తన సహాయం అందించాడు. కాగా లాక్‌డౌన్‌లో ఈ ఇద్దరు రియల్ హీరోల సేవలు గుర్తించిన ప్రజలు భారత రత్నకు సిఫారసు చేస్తున్నారు.
దీంతో భారతదేశ అత్యున్నత పురస్కారమైన ‘భారతరత్న’ అవార్డు గత కొంతకాలంగా ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో నడుస్తోంది. మైక్రో బ్లాగింగ్ సైట్‌లో నిజమైన రత్నాలు.. అక్షయ్ కుమార్, సోనూసూద్‌లకు భారత రత్న అందించాలని డిమాండ్ చేస్తున్నారు. వాళ్లు ఎలాంటి అవార్డు, రివార్డు ఆశించి కరోనా విపత్కర పరిస్థితుల్లో సాయం అందించలేదన్న నెటిజన్లు.. వారి మానవత్వాన్ని గుర్తించాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇలా చేస్తే అవార్డుకు ఉన్న గౌరవం పెరుగుతుందని అభిప్రాయ పడుతున్నారు.