కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలో.. ఆల్ టైం రికార్డ్.. ఒకే రోజు
దిశ, తుంగతుర్తి: కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలో నియోజకవర్గ కేంద్రమైన తుంగతుర్తి లోని ప్రభుత్వ ఆసుపత్రి ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. పదికాదు 20 కాదు 50 అంతకంటే కాదు. ఏకంగా 92 కుటుంబ నియంత్రణలు గురువారం మధ్యాహ్నం నుండి ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు పూర్తయ్యాయి. సాధారణంగా చేతితో కుటుంబ నియంత్రణ చేయాలంటే గంట నుంచి రెండు గంటల సమయం పడుతుంది. పైగా ఒకటి లేదా 2 రోజులు ఆసుపత్రిలోనే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. […]
దిశ, తుంగతుర్తి: కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలో నియోజకవర్గ కేంద్రమైన తుంగతుర్తి లోని ప్రభుత్వ ఆసుపత్రి ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. పదికాదు 20 కాదు 50 అంతకంటే కాదు. ఏకంగా 92 కుటుంబ నియంత్రణలు గురువారం మధ్యాహ్నం నుండి ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు పూర్తయ్యాయి. సాధారణంగా చేతితో కుటుంబ నియంత్రణ చేయాలంటే గంట నుంచి రెండు గంటల సమయం పడుతుంది. పైగా ఒకటి లేదా 2 రోజులు ఆసుపత్రిలోనే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే కొత్తగా అమల్లోకి వచ్చిన కుటుంబ నియంత్రణలు(డబుల్ పంచర్ లాపరోస్కోప్, డి.పి.ఎల్) కోత, కుట్లు లేకుండా కేవలం 2 నుండి 5 నిమిషాల్లో పూర్తవుతుంది.
అనంతరం గంట,రెండు గంటల్లోనే తమ తమ ఇళ్లకు చేరుకోవచ్చు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ జాన్ సోయల్ వీటిని నిర్వహించారు. ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ, వరంగల్ ఖమ్మం జిల్లాల నుంచి ఉదయమే కుటుంబ నియంత్రణ చేయించుకోవడానికి మహిళలు వందలాదిగా తరలివచ్చారు. అయితే అన్ని పరీక్షల అనంతరం 92 మందికి మాత్రమే ఆపరేషన్లు చేశారు. మిగిలిన వారిని మరోమారు తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలోనే నిర్వహించే క్యాంపుకు రావాలని చెప్పి పంపించారు.
కుటుంబ నియంత్రణ చేసుకున్న మహిళలకు ఆసుపత్రిలో మంచాలు సరిపోక చాలా మందిని వరండాలోనే కింద పడుకోబెట్టారు. శస్త్ర చికిత్స చేసుకున్న వారిని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ, జిల్లా గణాంకాల అధికారి వీరయ్య పరీక్షించి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు నాగు నాయక్, అరుంధతి, సురేష్, సునీత, దీప్తి, విజయ నిర్మల, హెచ్ఈఓ సముద్రాల సూరి, టి.బి నోడల్ పర్సన్ లకావత్ యాదగిరి, లెప్రసి నోడల్ పర్సన్ గాజుల యాదగిరి, చారి, నవీన్ తదితరులు పాల్గొన్నారు. కు.ని శస్త్రచికిత్స శిబిరంలోనే కరోనా వ్యాక్సిన్ తీసుకోని 14 మందిని డాక్టర్లు గుర్తించారు. వ్యాక్సిన్ తీసుకున్నాక ఆపరేషన్లు నిర్వహించారు.