కరోనా కేసుల విషయంలో తప్పుడు లెక్కలు.. ఆసుపత్రుల్లో బెడ్ల కొరత ఉంది..
దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా కేసుల విషయంలో ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని హైకోర్టు పేర్కొందని ఏఐసీసీ అధికార ప్రతినిధి ధాసోజు శ్రవణ్ ఆరోపించారు. గాంధీ భవన్‌లో ఈరోజు శ్రవణ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా విజృంభిస్తుంటే కేసీఆర్ పట్టించుకోవడం లేదని, ఆసుపత్రుల్లో బెడ్లు కూడా అందుబాటులో లేవన్నారు. మంత్రి ఈటలకు పూర్తి స్థాయిలో అధికారం ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్, రెమిడెసివర్ ఇంజక్షన్ల కోసం ప్రజలు అల్లాడుతున్నారన్నారు. ప్రస్తుత […]
దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా కేసుల విషయంలో ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని హైకోర్టు పేర్కొందని ఏఐసీసీ అధికార ప్రతినిధి ధాసోజు శ్రవణ్ ఆరోపించారు. గాంధీ భవన్‌లో ఈరోజు శ్రవణ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా విజృంభిస్తుంటే కేసీఆర్ పట్టించుకోవడం లేదని, ఆసుపత్రుల్లో బెడ్లు కూడా అందుబాటులో లేవన్నారు. మంత్రి ఈటలకు పూర్తి స్థాయిలో అధికారం ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్, రెమిడెసివర్ ఇంజక్షన్ల కోసం ప్రజలు అల్లాడుతున్నారన్నారు. ప్రస్తుత పరిస్థితిని చూసి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎంత మంది డాక్టర్లు, నర్సులను రిక్రూట్ చేశారని ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వడం లేదన్నారు. గతేడాది కరోనాని ఆరోగ్య శ్రీలో చేరుస్తామని చెప్పిన కేసీఆర్.. ఎందుకు చేర్చడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. బస్తీ దవాఖానలను కోవిడ్ టెస్ట్, టీకా కేంద్రాలుగా మార్చాలని సూచించినా పట్టించుకోవడం లేదన్నారు. సీఎం కేసీఆర్‌కి ఎన్నికల మీద ఉన్న ధ్యాస ప్రజారోగ్యంపై లేదని చెప్పారు. ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఎస్ఈసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం సరికాదన్నారు. వెంటనే మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయాలని ఆయన డిమాండ్ చేశారు.