ఐసీయూలో ప్రమాదం.. పేషెంట్‌పై కూలిన సీలింగ్ (వీడియో)
దిశ,మహబూబాబాద్ టౌన్ : రాత్రి కురిసిన వర్షానికి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఐ.సీ.యులోకి భారీగా వరద నీరు చేరడంతో సీలింగ్ కూలి ఆరు మంది పేషెంట్‌లపై పడింది. సిబ్బంది వెంటనే అప్రమత్తమై విద్యుత్‌ను నిలిపివేసి ఐ. సీ.యులో ఉన్న పది మంది పేషంట్లను మరో వార్డులోకి తరలించారు. దీంతో ప్రమాదం తప్పింది. మహబూబాబాద్ ప్రభుత్వ హాస్పిటల్‌ను 300 పడకలుగా ఇటీవలే అప్ గ్రేడ్ చేశారు. మొదటి అంతస్తులో ఐ సీ యూ ఉంది. 2 […]

దిశ,మహబూబాబాద్ టౌన్ : రాత్రి కురిసిన వర్షానికి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఐ.సీ.యులోకి భారీగా వరద నీరు చేరడంతో సీలింగ్ కూలి ఆరు మంది పేషెంట్‌లపై పడింది. సిబ్బంది వెంటనే అప్రమత్తమై విద్యుత్‌ను నిలిపివేసి ఐ. సీ.యులో ఉన్న పది మంది పేషంట్లను మరో వార్డులోకి తరలించారు. దీంతో ప్రమాదం తప్పింది. మహబూబాబాద్ ప్రభుత్వ హాస్పిటల్‌ను 300 పడకలుగా ఇటీవలే అప్ గ్రేడ్ చేశారు. మొదటి అంతస్తులో ఐ సీ యూ ఉంది. 2 వ అంతస్తులో నిర్మాణం చేసేందుకు స్లాబ్‌కు రంధ్రాలు చేశారు. ఈ రంధ్రాల నుండి వర్షం నీరు ఐసీయూలో చేరుకొని సీలింగ్ కూలింది.