గాడ్జెట్ రిపేర్ కోసమొస్తే.. ఆమె పరువు తీశాడు
దిశ, క్రైమ్‌బ్యూరో : రిపేర్ కోసం ఇచ్చిన గాడ్జెట్ (ట్యాబ్) నుంచి ఫోటోలు దొంగతనంగా కాపీ చేసుకుని నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్ క్రియేట్ చేసి అసభ్యకర మెస్సేజ్‌లు పంపుతున్న వ్యక్తిని రాచకొండ సైబర్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వివరాల్లోకివెళితే.. దిల్‌సుఖ్ నగర్‌లోని వికాస్‌నగర్‌కు చెందిన అశోక్ పటేల్‌కు జగదీష్ మార్కెట్‌లో సెల్‌ఫోన్ సేల్స్ అండ్ రిపేర్ షాపు ఉంది. అయితే, ఓ మహిళ తన ట్యాబ్ డిస్ ప్లే బాగుచేయాలని అశోక్ దుకాణానికి వెళ్లింది. రెండ్రోజుల్లో […]
దిశ, క్రైమ్‌బ్యూరో : రిపేర్ కోసం ఇచ్చిన గాడ్జెట్ (ట్యాబ్) నుంచి ఫోటోలు దొంగతనంగా కాపీ చేసుకుని నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్ క్రియేట్ చేసి అసభ్యకర మెస్సేజ్‌లు పంపుతున్న వ్యక్తిని రాచకొండ సైబర్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వివరాల్లోకివెళితే.. దిల్‌సుఖ్ నగర్‌లోని వికాస్‌నగర్‌కు చెందిన అశోక్ పటేల్‌కు జగదీష్ మార్కెట్‌లో సెల్‌ఫోన్ సేల్స్ అండ్ రిపేర్ షాపు ఉంది. అయితే, ఓ మహిళ తన ట్యాబ్ డిస్ ప్లే బాగుచేయాలని అశోక్ దుకాణానికి వెళ్లింది. రెండ్రోజుల్లో డిస్ ప్లే వేసి ఇస్తానని చెప్పి.. అందులోని మహిళ ఫోటోలను తన మొబైల్‌కు పంపించుకున్నాడు.
అనంతరం బాధిత మహిళ పేరు, ఫొటో ఉపయోగించి నకిలీ FB అకౌంట్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత బాధితురాలితో పాటు పలువురికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. అంతటితో ఆగకుండా.. పలు అసభ్యకరమైన మెస్సేజ్‌లను పంపుతూ ఆ మహిళ పేరు ప్రతిష్టలు దెబ్బతినేలా వ్యవహారించాడు. దీంతో బాధిత మహిళ రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును చాకచక్యంగా పరిష్కరించిన క్రైమ్ డీసీపీ యాదగిరి, అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, ఏసీపీ హరినాథ్, ఇన్ స్పెక్టర్ ఆర్.వెంకటేష్‌లను సీపీ మహేష్ భగవత్ అభినందించారు.