Face book నుంచి స్మార్ట్ వాచ్.. సరికొత్త ఫీచర్స్ దీని సొంతం!

దిశ, వెబ్‌డెస్క్ :ప్రపంచంలోనే సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ (Face book) సరికొత్త విప్లవానికి తెరలేపింది. ఇన్ని రోజులు సోషల్ మీడియా, యాడ్స్ విభాగాలకు పరిమితమైన ఫేస్‌బుక్ సరికొత్త విపణిలోకి అడుగుపెట్టున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు స్మార్ట్ వాచ్‌ల విభాగంలో రారాజుగా కొనసాగుతున్న ఆపిల్(Apple) కంపెనీకి పోటీగా ఫేస్‌బుక్ స్మార్ట్‌ వాచ్‌లను తీసుకురానున్నట్లు సమాచారం. 2022 లోగా ఫేస్‌బుక్ నుంచి సరికొత్త ఫీచర్లతో స్మార్ట్ వాచ్‌ మార్కెట్లోకి విడుదల కానున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. అందుకు సంబంధించిన వర్క్స్ శరవేగంగా […]

Update: 2021-06-10 05:53 GMT

దిశ, వెబ్‌డెస్క్ :ప్రపంచంలోనే సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ (Face book) సరికొత్త విప్లవానికి తెరలేపింది. ఇన్ని రోజులు సోషల్ మీడియా, యాడ్స్ విభాగాలకు పరిమితమైన ఫేస్‌బుక్ సరికొత్త విపణిలోకి అడుగుపెట్టున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు స్మార్ట్ వాచ్‌ల విభాగంలో రారాజుగా కొనసాగుతున్న ఆపిల్(Apple) కంపెనీకి పోటీగా ఫేస్‌బుక్ స్మార్ట్‌ వాచ్‌లను తీసుకురానున్నట్లు సమాచారం. 2022 లోగా ఫేస్‌బుక్ నుంచి సరికొత్త ఫీచర్లతో స్మార్ట్ వాచ్‌ మార్కెట్లోకి విడుదల కానున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. అందుకు సంబంధించిన వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయని ‘వర్జ్’ రిపోర్టు తెలిపింది.

ప్రస్తుతం ‘టెక్ రివాల్యుషన్’ సరికొత్త రంగులు పులుముకుంటున్న వేళ ప్రపంచ మార్కెట్లో సత్తా చాటేందుకు ఫేస్‌బుక్ సీఈవో మార్గ్ జుకర్ బర్గ్ సిద్ధపడినట్లు పేర్కొంది. ఇప్పటితరం వారు స్మార్ట్ ఫోన్లకు క్రమంగా అలవాటు పడిపోయారు. ఫోన్ల స్థానాన్ని భర్తీ చేయడంతో పాటు స్మార్ట్ టెక్నాలజీని మరింత సులభతరం చేసేందుకు ఫేస్‌బుక్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆపిల్ కంపెనీ అందించే ఫోన్లకు గానీ, స్మార్ట్ వాచ్‌లకు గానీ ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. మార్కెట్లోకి కొత్త వెర్షన్ రిలీజ్ అయ్యిందంటే చాలు కొన్ని గంటల్లోనే లక్షల బుకింగ్స్ అయిపోతాయి. స్టాక్ కూడా దొరకదు. ఆపిల్ ఉత్పత్తుల కోసం కొన్ని నెలల ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్ చేసుకునేవారు సైతం చాలా మందే ఉన్నారు. ధర కూడా ఆపిల్ బ్రాండ్‌కు తగ్గట్లే ఉంటుంది.

వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని స్మార్ట్ వాచ్‌ల విపణీలోకి ఫేస్‌బుక్ రంగ ప్రవేశం చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆపిల్ స్మార్ట్ వాచ్‌ జీపీఎస్, కాలింగ్, మెస్సెజ్, టెంపరేచర్ వంటి ఫీచర్స్‌ను కలిగి ఉంది. అయితే, ఫేస్‌బుక్ విడుదల చేసే స్మార్ట్ వాచుల్లో వీడియో కాలింగ్ ఆప్షన్ కూడా ఇస్తున్నారు. అందుకోసం రెండు కెమెరాలు అమర్చారు. వీటి ద్వారా ఫోటోలు తీసుకోవడంతో పాటు వీడియో రికార్డింగ్ చేయవచ్చు. బెస్ట్ క్వాలిటీ ఇమెజెస్, వీడియో‌స్ కోసం 1080P అటో ఫోకస్‌తో రీయర్ కెమెరాను ఫిక్స్ చేశారు. అంతేకాకుండా ‘హర్ట్‌బీట్ మానిటర్’ ఆప్షన్ కూడా ఉంది. చేతికి అమర్చిన తర్వాత పల్స్ రేట్ ఆధారంగా హార్ట్ బీట్ వివరాలను అందిస్తుంది. ప్రపంచలోని వినియోగదారులను అట్రాక్ట్ చేసేందుకు సరికొత్త ఫీచర్స్‌తో 2022 ప్రారంభంలో ఈ స్మార్ట్ వాచ్‌ను మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ఫేస్‌బుక్ కంపెనీ ప్రకటించింది. అయితే, ఈ వాచ్‌ సంబంధించి ధర ఎంత ఉంటుందనే అంశంపై ఫేస్‌బుక్ క్లారిటీ ఇవ్వలేదు.

Tags:    

Similar News