ఫేస్‌బుక్ యూజర్లపై ‘నిఘా’
ఢిల్లీ : తప్పుడు యాడ్స్ డిస్‌ప్లే చేసే ఫేస్‌బుక్, వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ యూజర్లను నిశితంగా పరిశీలిస్తున్నట్టు ఫేస్‌బుక్ వెల్లడించింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్-19 (కరోనావైరస్)కు సంబంధించి తప్పుడు సమాచారాన్నిస్తున్న ప్రకటనలను నిషేధించినట్టుగా ప్రకటించింది. ‘వైరస్ వ్యాప్తిని నివారించేందుకు ఫేస్ మాస్క్‌లు 100 శాతం ఉపయోగడతాయి’ వంటి సందేహాస్పదమైన ప్రకటనలను అనుమతించబోమని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ఇలాంటి సమాచారం, ప్రకటనలు..ఈ వైరస్‌పై చేస్తోన్న పోరాటంపై ప్రతికూల ప్రభావాన్ని చూపెడతాయని ఫేస్‌బుక్ పేర్కొంది. […]
ఢిల్లీ : తప్పుడు యాడ్స్ డిస్‌ప్లే చేసే ఫేస్‌బుక్, వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ యూజర్లను నిశితంగా పరిశీలిస్తున్నట్టు ఫేస్‌బుక్ వెల్లడించింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్-19 (కరోనావైరస్)కు సంబంధించి తప్పుడు సమాచారాన్నిస్తున్న ప్రకటనలను నిషేధించినట్టుగా ప్రకటించింది. ‘వైరస్ వ్యాప్తిని నివారించేందుకు ఫేస్ మాస్క్‌లు 100 శాతం ఉపయోగడతాయి’ వంటి సందేహాస్పదమైన ప్రకటనలను అనుమతించబోమని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ఇలాంటి సమాచారం, ప్రకటనలు..ఈ వైరస్‌పై చేస్తోన్న పోరాటంపై ప్రతికూల ప్రభావాన్ని చూపెడతాయని ఫేస్‌బుక్ పేర్కొంది. ఈ తరహా ప్రకటనలను తొలగించే ప్రక్రియను జనవరి 31 నుంచే ప్రారంభించామని, ఫేస్‌బుక్ న్యూస్ ఫీడ్‌పై కనిపించే ప్రతి తప్పుడు సమాచారాన్ని సోషల్ ఫ్యాక్ట్ చెకర్స్ ద్వారా గుర్తిస్తున్నామని చెప్పింది.