'వామ్మో! ఈ శిక్ష నాకొద్దు… నేనెప్పుడూ మాస్క్ మరచిపోను'

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా విలయ తాండవం చేస్తుంది. కరోనా కట్టడికి దేశంలోని అన్ని ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టాయి. ఇక మహానగరాలైన ఢిల్లీ, మహా రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో ఇప్పటికే లాక్ డౌన్ లు కూడా అనౌన్స్ చేశారు. ఎప్పటికప్పడు ప్రజలందరూ మాస్క్ తప్పక ధరించాలని, భౌతిక దూరం పాటించాలని పోలీసులు చెప్తూనే ఉన్నారు. అంతేకాకుండా మాస్క్ పెట్టుకోకపోతే ఫైన్ చెల్లించాలి అని చెప్తున్నా కొంతమంది మాత్రం ఆ మాటను పక్కన పెట్టి […]

Update: 2021-03-31 05:45 GMT

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా విలయ తాండవం చేస్తుంది. కరోనా కట్టడికి దేశంలోని అన్ని ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టాయి. ఇక మహానగరాలైన ఢిల్లీ, మహా రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో ఇప్పటికే లాక్ డౌన్ లు కూడా అనౌన్స్ చేశారు. ఎప్పటికప్పడు ప్రజలందరూ మాస్క్ తప్పక ధరించాలని, భౌతిక దూరం పాటించాలని పోలీసులు చెప్తూనే ఉన్నారు. అంతేకాకుండా మాస్క్ పెట్టుకోకపోతే ఫైన్ చెల్లించాలి అని చెప్తున్నా కొంతమంది మాత్రం ఆ మాటను పక్కన పెట్టి విచ్చల విడిగా రోడ్లపై తిరిగేస్తున్నారు. అలా మాస్క్ లేకుండా తిరుగుతున్న వారికి ముంబై పోలీసులు కఠిన శిక్షనే విధించారు. మాస్క్ పెట్టుకోకుండా బయట తిరుగుతున్న కుర్రాళ్లను మెరీనా బీచ్ వద్ద అడ్డుకున్న పోలీసులు వారితో డక్ వాక్ చేయించారు.

ఇందుకు సంబంధించిన వీడియోను ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ..” ఈ శిక్షను చూస్తుంటే నేను బోర్డింగ్ స్కూల్ లో చదివేటప్పుడు విధించిన శిక్షలు గుర్తొస్తున్నాయి… ఈ శిక్ష చూసాకా ఎట్టి పరిస్థితిలోను నేను మాస్క్ మరచిపోను” అంటూ ట్వీట్ చేసారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Tags:    

Similar News