తెలంగాణలో వేసవి సెలవులు పొడగింపు

దిశ, తెలంగాణ బ్యూరో: జూన్ 15వరకు వేసవి సెలవులు పొడగిస్తున్నట్టుగా విద్యాశాఖ ప్రకటించింది. అన్ని విద్యాసంస్థలకు ఈ ఆదేశాలు అమలవుతాయని పేర్కొన్నారు. లాక్‌డౌన్, కరోనా వ్యాధి వ్యాప్తి పరిస్ధితుల దృష్ట్యా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలిపారు. ఈ ఏడాది విద్యాసంవత్సరంలో ఏప్రిల్ 5 నుంచి ప్రభుత్వం ఒంటి పూట బడులను నిర్వహించింది. అనంతరం ఏప్రిల్ 27 నుంచి మే 31వరకు 35 రోజుల పాటు వేసవి సెలవులను ప్రకటించారు. ప్రస్తుతం మరో 15రోజుల పాటు సెలవులను పొడగిస్తున్నట్టుగా […]

Update: 2021-05-31 08:04 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: జూన్ 15వరకు వేసవి సెలవులు పొడగిస్తున్నట్టుగా విద్యాశాఖ ప్రకటించింది. అన్ని విద్యాసంస్థలకు ఈ ఆదేశాలు అమలవుతాయని పేర్కొన్నారు. లాక్‌డౌన్, కరోనా వ్యాధి వ్యాప్తి పరిస్ధితుల దృష్ట్యా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలిపారు. ఈ ఏడాది విద్యాసంవత్సరంలో ఏప్రిల్ 5 నుంచి ప్రభుత్వం ఒంటి పూట బడులను నిర్వహించింది. అనంతరం ఏప్రిల్ 27 నుంచి మే 31వరకు 35 రోజుల పాటు వేసవి సెలవులను ప్రకటించారు. ప్రస్తుతం మరో 15రోజుల పాటు సెలవులను పొడగిస్తున్నట్టుగా తెలిపారు. జూన్ 15న విద్యాసంస్థల ప్రారంభంపై ప్రభుత్వ నిర్ణయాలను ప్రకటించనున్నారు. కొవిడ్ కారణంగా 1 నుంచి 10వ తరగతి విద్యార్థులను, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే పై తరగతులకు ప్రమోట్ చేశారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జులై 3వ వారంలో పరీక్షలు నిర్వహించనున్నారు.

Tags:    

Similar News