వివేకానంద విదేశీ విద్యాపథకం దరఖాస్తు గడువు పెంపు

దిశ, తెలంగాణ బ్యూరో : బ్రాహ్మణ విద్యార్థులకు విదేశీ విద్యను అభ్యసించేందుకు ప్రవేశపెట్టిన వివేకానంద విదేశీ విద్యా పథకంను దరఖాస్తు గడువును తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ జూన్ 18 వరకు పెంచింది. ఈ నెల 28వ తేదీ చివరి తేదీ కాగా లాక్ డౌన్ నేపథ్యంలో విద్యార్థులకు కుల, ఆదాయ, ధ్రువీకరణ పత్రాలు, విదేశీ యూనివర్సిటీల నుంచి ఐ-20 లెటర్లు తీసుకోవడంలో ఆలస్యమవుతున్నందని తెలిపారు. అర్హత కలిగి దరఖాస్తు చేసుకోని అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గడువు […]

Update: 2021-05-26 06:38 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : బ్రాహ్మణ విద్యార్థులకు విదేశీ విద్యను అభ్యసించేందుకు ప్రవేశపెట్టిన వివేకానంద విదేశీ విద్యా పథకంను దరఖాస్తు గడువును తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ జూన్ 18 వరకు పెంచింది. ఈ నెల 28వ తేదీ చివరి తేదీ కాగా లాక్ డౌన్ నేపథ్యంలో విద్యార్థులకు కుల, ఆదాయ, ధ్రువీకరణ పత్రాలు, విదేశీ యూనివర్సిటీల నుంచి ఐ-20 లెటర్లు తీసుకోవడంలో ఆలస్యమవుతున్నందని తెలిపారు.

అర్హత కలిగి దరఖాస్తు చేసుకోని అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గడువు పెంచినట్లు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అడ్మినిస్ట్రేటర్ కె. చంద్రమోహన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వెబ్ సైట్ WWW.brahminparishad.telangana.gov.in దరఖాస్తు చేసుకోవాలని వివరించారు.

Tags:    

Similar News