భారతీయులంతా గర్వపడే వార్త చెప్పిన పీయూష్
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరంలో 500 బిలియన్ డాలర్ల ఎగుమతులే లక్ష్యమని కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ అన్నారు. ప్రస్తుతం దేశ ఎగుమతుల రేటు ఆరోగ్యకరమైన స్థాయిలో పెరుగుతోందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్- సెప్టెంబర్ కాలంలో ఎగుమతులు 197 బిలియన్ డాలర్లను చేరుకున్నాయని చెప్పారు. ‘ మనం లక్ష్యంగా పెట్టుకున్న ఎగుమతుల్లో 48 శాతాన్ని ఇప్పటికే చేరుకున్నాం. ఈ ఏడాది నిర్ధేశించుకున్న ఎగుమతుల లక్ష్యం 400 బిలియన్ డాలర్లను చేరేందుకు సరైన మార్గంలోనే ప్రయాణిస్తున్నాం. ప్రస్తుతం […]
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరంలో 500 బిలియన్ డాలర్ల ఎగుమతులే లక్ష్యమని కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ అన్నారు. ప్రస్తుతం దేశ ఎగుమతుల రేటు ఆరోగ్యకరమైన స్థాయిలో పెరుగుతోందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్- సెప్టెంబర్ కాలంలో ఎగుమతులు 197 బిలియన్ డాలర్లను చేరుకున్నాయని చెప్పారు. ‘ మనం లక్ష్యంగా పెట్టుకున్న ఎగుమతుల్లో 48 శాతాన్ని ఇప్పటికే చేరుకున్నాం. ఈ ఏడాది నిర్ధేశించుకున్న ఎగుమతుల లక్ష్యం 400 బిలియన్ డాలర్లను చేరేందుకు సరైన మార్గంలోనే ప్రయాణిస్తున్నాం. ప్రస్తుతం మన ఎగుమతిదారులు భారతీయులంతా గర్వపడేలా చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 450-500 బిలియన్ డాలర్ల ఎగుమతులను చేరుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం’ అని అన్నారు. యూకే, ఏఈ, ఓమన్, ఆస్ట్రేలియా, కెనడా, ఈయూ, రష్యా లాంటి పలు దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ) చేసుకునేందుకు చర్చిస్తున్నామని తెలిపారు. ప్రధాని మోడీ అక్టోబర్ 13న గతి శక్తి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి కౌన్సిల్ హెడ్‌లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కావాలని కోరారు.