ప్రపంచ మార్కెట్లోకి మేడ్ ఇన్ ఇండియా బైక్!
దిశ, వెబ్‌డెస్క్: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా నుంచి గతేడాది మార్కెట్లో విడుదలైన మిడ్-సైజ్ ప్రీమియం బైక్ హైనెస్ సీబీ 350ని అంతర్జాతీయంగా ఎగుమతి చేయాలని కంపెనీ భావిస్తోంది. దేశీయ ప్లాంట్‌లో 90 శాతానికిపైగా స్థానికీకరణతో కంపెనీ ఈ బైక్‌ను ఉత్పత్తి చేసిందని, స్థానిక మార్కెట్లో ఈ మోడల్ బలమైన డిమాండ్‌ను తీరుస్తోందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. గతేడాది అక్టోబర్‌లో ఈ బైక్‌ను ప్రవేశపెట్టాం. ఇప్పటికే దేశీయ మార్కెట్లో ఫిబ్రవరి నాటికి 10 వేల […]
దిశ, వెబ్‌డెస్క్: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా నుంచి గతేడాది మార్కెట్లో విడుదలైన మిడ్-సైజ్ ప్రీమియం బైక్ హైనెస్ సీబీ 350ని అంతర్జాతీయంగా ఎగుమతి చేయాలని కంపెనీ భావిస్తోంది. దేశీయ ప్లాంట్‌లో 90 శాతానికిపైగా స్థానికీకరణతో కంపెనీ ఈ బైక్‌ను ఉత్పత్తి చేసిందని, స్థానిక మార్కెట్లో ఈ మోడల్ బలమైన డిమాండ్‌ను తీరుస్తోందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. గతేడాది అక్టోబర్‌లో ఈ బైక్‌ను ప్రవేశపెట్టాం. ఇప్పటికే దేశీయ మార్కెట్లో ఫిబ్రవరి నాటికి 10 వేల అమ్మకాల మార్కును దాటిందని కంపెనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ యద్విందర్ సింగ్ గులేరియా చెప్పారు. ‘ ఈ మోడల్ ఇప్పటికే యూరప్ మార్కెట్ల నిబంధనలను కలిగి ఉంది. అనేక దేశాల్లో ఎగుమతి చేయగల ఫీచర్లు ఈ బైక్‌లో ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచ మార్కెట్లకు దీన్ని ఎగుమతి చేయాలని నిర్ణయించాం. దీనికి అవసరమైన చర్చలను జరుపుతున్నట్టు యద్విందర్ పేర్కొన్నారు. ఈ బైకును ప్రపంచానికి ‘మేడ్ ఇన్ ఇండియా’గా పరిచయం చేయాలనుకుంటున్నాం. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఈ బైక్ కోసం వచ్చిన బుకింగ్‌లను తీర్చడంపై దృష్టి పెట్టామని ఆయన వెల్లడించారు.