అంగన్‌వాడీలో అరాచకం.. చిన్నారుల ప్రాణలతో చెలగాటం
దిశ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం అంగన్ వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు అందించే పౌష్టికాహారం బాలామృతం ప్యాకెట్లను కాల పరిమితి ముగిసిన తర్వాత అందజేశారు. ఈ ఘటన జిల్లా కేంద్రంలోని కేసముద్రం మండలం కల్వల గ్రామంలో గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. సుమారు 8 మంది పిల్లల తల్లిదండ్రులకు అంగన్వాడీ సిబ్బంది ఈ ప్యాకెట్స్ అందజేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని రేణుక, రాధ అనే పిల్లల తల్లులు తెలిపారు. […]
దిశ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం అంగన్ వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు అందించే పౌష్టికాహారం బాలామృతం ప్యాకెట్లను కాల పరిమితి ముగిసిన తర్వాత అందజేశారు. ఈ ఘటన జిల్లా కేంద్రంలోని కేసముద్రం మండలం కల్వల గ్రామంలో గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది.
సుమారు 8 మంది పిల్లల తల్లిదండ్రులకు అంగన్వాడీ సిబ్బంది ఈ ప్యాకెట్స్ అందజేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని రేణుక, రాధ అనే పిల్లల తల్లులు తెలిపారు. దీనిపై స్పందించిన అంగన్ వాడీ సూపర్వైజర్ విజయ మాట్లాడుతూ.. బాలామృతం ప్యాకెట్స్ కాలపరిమితి ముగిసింది వాస్తవమే అని, ఈ విషయంపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.