ఎక్సైడ్ ఇండస్ట్రీస్ తొలి త్రైమాసిక లాభం రూ. 14 కోట్లు!
దిశ, వెబ్‌డెస్క్ : కొవిడ్-19 వల్ల కలిగిన అంతరాయాల ప్రభావంతో 2020-21 ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ప్రముఖ బ్యాటరీ కంపెనీ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ రూ. 13.56 కోట్ల నికర నష్టాన్ని వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 161.58 కోట్ల నికర లాభాలను వెల్లడించింది. ఇక, సమీక్షించిన తొలి త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ. 2,537.55 కోట్లు ఉందని, గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 3,691.33 కోట్లను […]
దిశ, వెబ్‌డెస్క్ : కొవిడ్-19 వల్ల కలిగిన అంతరాయాల ప్రభావంతో 2020-21 ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ప్రముఖ బ్యాటరీ కంపెనీ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ రూ. 13.56 కోట్ల నికర నష్టాన్ని వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 161.58 కోట్ల నికర లాభాలను వెల్లడించింది. ఇక, సమీక్షించిన తొలి త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ. 2,537.55 కోట్లు ఉందని, గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 3,691.33 కోట్లను నమోదు చేసినట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.
కొవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు లాక్‌డౌన్ విధించడం వల్ల సంస్థ తయారీ, సరఫరా వ్యవస్థల్లో ఆటంకాలు ఏర్పడ్డాయని, అంతేకాకుండా అమ్మకాలు, పంపిణీ కార్యకలాపాల్లో తీవ్ర అంతరాయం ఏర్పడిందని ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ఎండీ, సీఈవో జీ.చటర్జీ తెలిపారు. ఈ పరిణామాలతో కంపెనీ అమ్మకాలపై, లాభదాయకతపై ప్రతికూల ప్రభావం ఏర్పడిందని, దీనికోసం మెరుగైన వ్యూహాలను, కంపెనీ ఖర్చులను నియంత్రించడం, సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి సారించామని చటర్జీ వివరించారు.