ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌ను సీబీఐకి పట్టించిన కాంట్రాక్టర్
దిశ, తెలంగాణ బ్యూరో : లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన విద్యుత్ శాఖ సీపీడబ్ల్యూడీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. పెండింగ్‌లో ఉన్న రూ.20 లక్షల బిల్లులను చెల్లించేందుకు గాను సంప్రదించిన కాంట్రాక్టర్ నుంచి బిల్లు మొత్తంలో మూడు శాతం లంచంగా ఇవ్వాలని ఆ అధికారి డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. వేరే దారి లేక రూ.60 వేలకు డీల్ కుదుర్చుకున్న కాంట్రాక్టర్ మొదటి విడతగా రూ.45వేలు చెల్లించాడు. అయితే మిగిలిన రూ.15వేలు కూడా […]
దిశ, తెలంగాణ బ్యూరో : లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన విద్యుత్ శాఖ సీపీడబ్ల్యూడీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. పెండింగ్‌లో ఉన్న రూ.20 లక్షల బిల్లులను చెల్లించేందుకు గాను సంప్రదించిన కాంట్రాక్టర్ నుంచి బిల్లు మొత్తంలో మూడు శాతం లంచంగా ఇవ్వాలని ఆ అధికారి డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. వేరే దారి లేక రూ.60 వేలకు డీల్ కుదుర్చుకున్న కాంట్రాక్టర్ మొదటి విడతగా రూ.45వేలు చెల్లించాడు. అయితే మిగిలిన రూ.15వేలు కూడా చెల్లించాలని కాంట్రాక్టర్ పై ఒత్తిడి తేవడంతో అతడు సీబీఐ అధికారులను సంప్రదించాడు.
దీంతో వారు అవినీతి అధికారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు పథకం రచించారు. రూ.15 వేలు చెల్లిస్తానని కాంట్రాక్టర్ ద్వారా సీబీఐ అధికారులు అతడి కార్యాలయానికి చేరుకున్నారు. నగదు తీసుకునే సమయంలో వారంతా వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా అతడిని పట్టుకున్నారు. అనంతరం అతడి కార్యాలయం, ఇంటి వద్ద తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలో రూ.1.34 లక్షల నగదుతో పాటు 27 డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఇంట్లో నిర్వహించిన సోదాల్లో రూ.30.50 లక్షల నగదు, బంగారం కొనుగోలు చేసిన పత్రాలు, పలు విలువైన డాక్యుమెంట్లు అధికారులకు లభ్యమయ్యాయి. కాగా నిందితుడిని మంగళవారం హైదరాబాద్ సీబీఐ స్పెషల్ జడ్జి ఎదుట హాజరుపరిచారు