అత్యాచారాల నిరోధానికి జీన్స్, స్కర్ట్స్ బహిష్కరణ

దిశ, వెబ్‌డెస్క్ : యువతుల వస్త్రాధారణపై గతంలో కొందరు చేసిన కామెంట్లు వివాదస్పదం అయ్యాయి. పొట్టి నిక్కర్లు, స్లీవ్ లెస్, స్కర్ట్స్, బిగుతు దుస్తులు ధరించడం వల్లే మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని సామాన్యుల నుంచి సెలబ్రెటీలకు వరకు వ్యాఖ్యలు చేశారు. వీటిపై మహిళ లోకం నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో వారు బహిరంగ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. తాజాగా ఓ కుల సంఘం కూడా ఇలాంటి వివాదస్పద నిర్ణయం తీసుకుంది. కేవలం అమ్మాయిలకే కాదు.. అబ్బాయిల […]

Update: 2021-03-10 07:12 GMT

దిశ, వెబ్‌డెస్క్ : యువతుల వస్త్రాధారణపై గతంలో కొందరు చేసిన కామెంట్లు వివాదస్పదం అయ్యాయి. పొట్టి నిక్కర్లు, స్లీవ్ లెస్, స్కర్ట్స్, బిగుతు దుస్తులు ధరించడం వల్లే మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని సామాన్యుల నుంచి సెలబ్రెటీలకు వరకు వ్యాఖ్యలు చేశారు. వీటిపై మహిళ లోకం నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో వారు బహిరంగ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. తాజాగా ఓ కుల సంఘం కూడా ఇలాంటి వివాదస్పద నిర్ణయం తీసుకుంది. కేవలం అమ్మాయిలకే కాదు.. అబ్బాయిల డ్రస్సింగ్ పై షరతులు విధించింది. ఇప్పుడా ఆదేశాలు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకూ ఏం జరిగిందంటే..

ఉత్తర ప్రదేశ్‌లో నేరాలు అధికంగా జరుగుతుంటాయి. నేషనల్ క్రైం బ్యూరో సైతం ఆ వివరాలను వెల్లడించింది. ఆ రాష్ట్రంలో ఎక్కువగా అత్యాచారాలు, హత్యలే జరుగుతున్నట్లు క్రైం రికార్డులు తెలుపుతున్నాయి. అయితే యూపీలో ఓ కుల సంఘం మహిళలపై అత్యాచారాలను అరికట్టేందుకని సంచలన నిర్ణయం తీసుకుంది. క్షత్రియ యువతులు, యువకులు గ్రామ పెద్దలు చెప్పిన విధంగానే డ్రస్సులు వేసుకోవాలని తీర్మానం చేశారు. ఆ తీర్మాణాన్ని ఎవరు అతిక్రమించినా గ్రామ బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు.

క్షత్రియ యువతులు జీన్స్, స్కర్ట్స్ ధరించడం నిషేధించారు. అలాడే యువకులు నిక్కర్లు (షార్ట్స్) వేసుకోవడం బంద్ చేయాలని ఆదేశించారు. క్షత్రియ సంస్క్రతి, సంప్రదాయం ఉట్టిపడే దుస్తులు ధరించాలని తీర్మానం చేశారు. గ్రామ పెద్దల ఆదేశాలను అతిక్రమించిన వారికి జరిమానా విధించడంతో పాటు కుల, గ్రామ బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు. ఈ తీర్పు మంగళవారం వెలుబడగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై మహిళ సంఘాలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి.

Tags:    

Similar News