దశలవారీగా టీ+1 విధానం అమలు.. ఎక్స్ఛేంజీల నిర్ణయం

దిశ, వెబ్‌డెస్క్: స్టాక్ ఎక్స్ఛేంజీలు, ఇతర మార్కెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థలు సోమవారం షేర్ల కొనుగోలు లేదా అమ్మకాలు జరిగిన మరుసటి రోజు సెటిల్ చేసే(టీ+1) విధానం అమలుకు రోడ్‌మ్యాప్‌ను విడుదల చేశాయి. టీ+1 అంటే షేర్ల అమ్మకాలు, కొనుగోలు జరిగిన మరుసటి రోజే లావాదేవీ పూర్తి చేయడం. ప్రస్తుతం లావాదేవీలు పూర్తి చేసిన రెండు రోజుల(టీ+2)కు స్టాక్ ఎక్స్ఛేంజీలు సెటిల్‌మెంట్ చేస్తున్నాయి. ఈ కొత్త టీ+1 సెటిల్‌మెంట్ విధానం వల్ల మార్కెట్ వర్గాలకు ప్రయోజనాలు ఉంటాయని మార్కెట్ల […]

Update: 2021-11-08 11:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: స్టాక్ ఎక్స్ఛేంజీలు, ఇతర మార్కెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థలు సోమవారం షేర్ల కొనుగోలు లేదా అమ్మకాలు జరిగిన మరుసటి రోజు సెటిల్ చేసే(టీ+1) విధానం అమలుకు రోడ్‌మ్యాప్‌ను విడుదల చేశాయి. టీ+1 అంటే షేర్ల అమ్మకాలు, కొనుగోలు జరిగిన మరుసటి రోజే లావాదేవీ పూర్తి చేయడం.

ప్రస్తుతం లావాదేవీలు పూర్తి చేసిన రెండు రోజుల(టీ+2)కు స్టాక్ ఎక్స్ఛేంజీలు సెటిల్‌మెంట్ చేస్తున్నాయి. ఈ కొత్త టీ+1 సెటిల్‌మెంట్ విధానం వల్ల మార్కెట్ వర్గాలకు ప్రయోజనాలు ఉంటాయని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఛైర్మన్ అజయ్ త్యాగి గతంలోనే ప్రకటించారు.

సెటిల్‌మెంట్ ప్రక్రియ దశలవారీగా అమలు చేయబడుతుంది. మొదట ఫిబ్రవరి 25 నుంచి దిగువన ఉన్న 100 కంపెనీలకు మాత్రమే వర్తిస్తుంది. 2022 మార్చి నుంచి లిస్టింగ్‌లోని దిగువన ఉన్న 500 కంపెనీలకు ఈ కొత్త విధానం అమలు చేయనున్నారు. ఈ మధ్యలో ఏదైనా కొత్త స్టాక్ లిస్టింగ్ చేయబడితే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా టీ+1 విధానాన్ని అమలు చేయనున్నారు.

Tags:    

Similar News