ఇది కరోనా తీసుకొచ్చిన మార్పు

కరోనా మనిషి జీవనంలో అనేక మార్పులను తీసుకొస్తున్నది. పట్నంలో ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. జనానికి వైరస్ భయం పట్టి పీడిస్తున్నది. దీంతో పట్టణాలు ఖాళీ అవుతున్నా యి. గతంలో భూములను కౌలుకు ఇచ్చి నగరాలకు చేరిన పెద్ద పట్టాదారుల నుంచీ కొలువులు కోల్పోయిన చిరుద్యోగుల వరకూ అందరూ ఊరి బాట పడుతున్నారు. సొంతంగా వ్యవసాయం చేసేందుకు, అక్కడే పనులు చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. దిశ, న్యూస్ బ్యూరో: కరోనా నేపథ్యంలో జనం కొత్త ఉపాధి మార్గాలను వెతుక్కుంటున్నారు. […]

Update: 2020-08-08 20:08 GMT

కరోనా మనిషి జీవనంలో అనేక మార్పులను తీసుకొస్తున్నది. పట్నంలో ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. జనానికి వైరస్ భయం పట్టి పీడిస్తున్నది. దీంతో పట్టణాలు ఖాళీ అవుతున్నా యి. గతంలో భూములను కౌలుకు ఇచ్చి నగరాలకు చేరిన పెద్ద పట్టాదారుల నుంచీ కొలువులు కోల్పోయిన చిరుద్యోగుల వరకూ అందరూ ఊరి బాట పడుతున్నారు. సొంతంగా వ్యవసాయం చేసేందుకు, అక్కడే పనులు చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు.

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా నేపథ్యంలో జనం కొత్త ఉపాధి మార్గాలను వెతుక్కుంటున్నారు. దీంతో పల్లెలు సస్యశ్యామలం దిశగా పయనిస్తున్నాయి. ఈ క్రమంలో సాగుబడిలోనూ కొత్త తరహా వ్యవస్థలు ఏర్పడు తున్నాయి. వ్యవసాయం పూర్తిగా యాంత్రీకరణగా మారింది. ఇప్పడెక్కడ చూసినా ట్రాక్టర్లు దర్శనమిస్తున్నాయి. ఈ ఏడాది తెలంగాణవ్యాప్తంగా సాగు విస్తీర్ణం బాగానే పెరిగిందని లెక్కలు చెబు తున్నాయి. ట్రాక్టర్ల కొనుగోళ్లు రెట్టింపయ్యాయి. గతేడాది అమ్మకాలతో పోలిస్తే ఇప్పటి గణాంకాలు అబ్బురపరుస్తున్నాయి. ఎగువ మధ్య తరగతి, సంపన్నవర్గాలు యాంత్రీకరణ వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. అందుకే ఇప్పుడు హైదరాబాద్, వరంగల్, నల్లగొండ, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి కేంద్రాల్లోని ట్రాక్టర్ల షోరూములు కళకళలాడుతు న్నాయి.

ట్రాక్టర్లు, రొటోవేటర్ల కొనుగోళ్లు, ఇతర వ్యవసాయ సంబంధ యంత్రాలు, వాహనాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. విద్యావంతులు సైతం సాగుడిలో రాణించేందుకు రంగంలోకి దిగారు. అనేక పల్లెల్లో మొన్నటి వరకు కాలేజీలు, కోచింగ్ సెంటర్లంటూ తిరిగిన యువత పొలం పనుల్లో తీరిక లేకుండా గడుపుతున్నారు. ఏ ఆధారమూ లేని వాళ్లు కూడా ఓ ట్రాక్టర్ కొని కిరాయికి నడుపుకోవచ్చునన్న ధీమాతో కనిపిస్తున్నారు. వ్యవసాయ కూలీల కొరత వేధిస్తున్న తరుణంలో సాగుబడి తీరును ‘కరోనా’ మార్చేస్తోంది. తెలంగాణలో అనేక కొత్త రకం పంటలు దర్శనమిస్తు న్నాయి. దేశవ్యాప్త ట్రాక్టర్ల అమ్మకాలు కూడా 30 శాతం పెరిగినట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

ఊహకందని సేల్స్

కరోనా ట్రాక్టర్ కంపెనీల దశ మార్చేస్తోంది. ఊహకందని అమ్మకాలు సాగుతున్నట్లు షోరూంల యజమానులు, డీలర్లు చెబుతున్నారు. 30 ఏండ్ల సుదీర్ఘ వ్యాపార అనుభవం కలిగినవాళ్లు కూడా విస్మయానికి గురవుతున్నారు. వైరస్ విజృంభన తర్వాత పల్లెకు మంచి రోజులొచ్చాయి. ప్రతి ఒక్కరూ పుట్టిన ఊర్లోనే ఉపాధిని వెతుక్కోవాలని నిర్ణయించుకుంటున్నారు. సొంతంగా ఏదైనా పని చేసుకొని తక్కువ సంపాదనతోనైనా హాయిగా ఉండాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే వ్యవసాయం పెరిగింది. మునుపెన్నడూ సాగు చేయని భూములను ఇప్పుడు ట్రాక్టర్లు దున్నేస్తున్నాయి. కొత్తగా పొలాలు అచ్చు కడుతున్నారని నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం వ్యవసాయ విస్తరణాధికారి బిరుదోజు విజయలక్ష్మి చెబుతున్నారు. ఉన్నత విద్యావంతు లు కూడా వ్యవసాయం చేస్తున్నారన్నారు. బీటెక్, డిగ్రీలు చదివిన అనేక మంది సాగులోకి వచ్చారన్నారు. అందుకే సాగులో యంత్రాల వినియోగం కూడా పెరుగుతోందని అభిప్రాయపడ్డారు. షోరూంలు, మెకానిక్ లు కూడా స్పేర్ పార్ట్స్ కూడా రెట్టింపుగా ఖరీదు చేసి పెట్టుకున్నారు. మళ్లీ దొరుకుతాయో లేవోనన్న భయంతో ముందే పెట్టుబడి పెడుతున్నట్లు స్పేర్ పార్ట్ డీలర్లు చెబుతున్నారు. ఆఖరికి స్పేర్ పార్ట్స్ వ్యాపారం కూడా ఈ ఏడాది రెట్టింపయినట్లు సమాచారం. ఒక్క మహీంద్రా స్పేర్ పార్టులే ఏటా రూ.20 కోట్ల వరకు అయ్యేది. ఇప్పడది రూ.30 కోట్లకు మించుతుందని డీలర్లు స్పష్టం చేస్తున్నారు. వర్షాలు సరిపడా కురిస్తే ఈ ఏడాది నుంచి గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ బలోపేతమవుతుందన్న విశ్వాసం కలుగుతోందంటున్నారు.

ట్రాక్టర్ విక్రయాలు పెరిగాయి

30 హార్స్ పవర్ సామర్థ్యం కలిగిన ట్రాక్టర్ కనీస ధర రూ. 5 లక్షలు. సంపన్న రైతులు లేదా భూస్వాములు వీటిని కొంటున్నారు. దేశం మొత్తం మీద సుమారు పది కోట్ల మంది రైతులు (99 .9 మిలియన్). సొంతంగా ఒక హెక్టారు కంటే తక్కువ భూమి కలిగి ఉన్నవారే. సగటుగా రైతుకు 0.38 హెక్టార్ల (ఎకరం కంటే తక్కువ) సాగుభూమి ఉండి సేద్యం చేస్తున్నట్లు లెక్క. వీరు ట్రా క్టర్లు కొనేంత ఆర్థిక స్థోమత లేనివారు. కరోనా కాలంలో బైకులు, కార్లు, కమర్షియల్ వాహనాల అమ్మకాలు ఘోరంగా పడిపోయాయి. ట్రాక్టర్ల అమ్మకాలు మాత్రం బాగానే ఉన్నాయి. దీంతో వ్య వసాయ రంగం మీద, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపైనా కరోనా ప్రభావం పెద్దగా లేదనే చెప్పాలి. – ట్రాక్టర్ ఉత్పత్తిదారుల అసోసియేషన్

35 ఏండ్లల్లో ఎప్పుడూ చూడలేదు

ఇలాంటి అమ్మకాలు ఎప్పుడూ చూడలేదు. నేను ఇదే ఫీల్డులో 35 ఏండ్లుగా ఉన్నా. ఈ స్థాయిలో అమ్మకాలు చూడలేదు. రెండు అవసరం ఉంటే నాలుగు కొనేస్తున్నారు. మా దగ్గరికి వచ్చే రిటెయిలర్లు రెట్టింపు కొనుగోళ్లు చేస్తున్నారు. వాళ్ల షోరూంల్లో స్టాకు పెట్టుకుంటున్నారు. దాంతో కొరత ఏర్పడుతోంది. వర్షాలు తొందరగా పడ్డాయి. అదో కారణం కావచ్చు. ట్రాక్టర్ల వినియోగం పెరిగినట్లు మా అమ్మకాలే చెబుతున్నాయి. ఏప్రిల్లో మేం తీయలేదు. మే, జూన్, జూలై నెలల్లో వ్యాపారం బాగా సాగింది. ఏటా మహింద్రా స్పేర్ పార్ట్స్ తెలంగాణ వ్యాప్తంగా రూ.20 కోట్ల వరకు ఉంటుంది. ఈ సారి అది రూ.30 కోట్లకు చేరుతుందని మా అంచనా. స్పేర్ పార్ట్స్ కూడా పెరిగాయి. వ్యవసాయం యంత్రాలతో సాగుతోంది. -నర్సింహారెడ్డి, మహీంద్రా ట్రాక్టర్ స్పేర్ పార్ట్స్ డీలర్, హైదరాబాద్

గ్రామాలలోనే అధికం

కరోనా కాలంలో ట్రాక్టర్ల అమ్మకాలు పెరిగాయి. పట్టణాల్లో వినియోగం తగ్గింది. గ్రామీణంలో మాత్రం రెట్టింపయ్యింది. గతేడాది రెండో క్వార్టర్లో 19 అమ్మితే, ఈ ఏడాది రెండో క్వార్టర్లో 45 వరకు అమ్మాం. తెలంగాణవ్యాప్తంగా ఎనిమిది వేల నుంచి తొమ్మది వేల వరకు అమ్మినట్లుంది. గ్రామీణ ప్రాంతంలో ట్రాక్టర్ల సందడి కనిపిస్తోంది. ప్రధానంగా మేం నల్లగొండలోనే ఎక్కువగా చూస్తున్నాం. వర్షాలు సకాలంలో కురిస్తే ఆర్ధికంగా బలపడుతారు. సెప్టెంబరు, అక్టోబరు వాతావరణంపై ఆధారపడి ఉంది. -కె. సందీప్ రెడ్డి, స్వరాజ్ ట్రాక్టర్ షోరూం యజమాని, రంగారెడ్డి అండ్ నల్లగొండ

Tags:    

Similar News