ఆ ధైర్యం వైసీపీకి లేదు : ఉండవల్లి

దిశ, వెబ్‌డెస్క్: పోలవరం ప్రాజెక్టుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… పోలవరం ప్రాజెక్టుకు ఈ పరిస్థితి వస్తుందనుకోలేదు అని అన్నారు. ప్రాజెక్టు విషయంలో జరుగుతున్న ప్రతి తప్పునూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నామని వెల్లడించారు. రిజర్వాయర్ నిర్మించేందుకు పోలవరం అనువైన ప్రాంతం అని గుర్తు చేశారు. అంతేగాకుండా భూ సేకరణ జరుగకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగదని అన్నారు. పోలవరం ఖర్చంతా భరిస్తామని విభజన చట్టంలో పెట్టారని తెలిపారు. […]

Update: 2020-10-29 03:30 GMT
ఆ ధైర్యం వైసీపీకి లేదు : ఉండవల్లి
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: పోలవరం ప్రాజెక్టుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… పోలవరం ప్రాజెక్టుకు ఈ పరిస్థితి వస్తుందనుకోలేదు అని అన్నారు. ప్రాజెక్టు విషయంలో జరుగుతున్న ప్రతి తప్పునూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నామని వెల్లడించారు. రిజర్వాయర్ నిర్మించేందుకు పోలవరం అనువైన ప్రాంతం అని గుర్తు చేశారు. అంతేగాకుండా భూ సేకరణ జరుగకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగదని అన్నారు. పోలవరం ఖర్చంతా భరిస్తామని విభజన చట్టంలో పెట్టారని తెలిపారు. పోలవరంపై కేంద్రాన్ని నిలదీసే ధైర్యం వైసీపీకి లేదని ఉండవల్లి విమర్శించారు.

Tags:    

Similar News