మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అరెస్ట్

దిశ, కరీంనగర్: మాజీ ఎంపీ, టీ-పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని కథలాపూర్, మేడిపల్లి మండలాలకు సాగునీటిని అందించే కలికోట సూరమ్మ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి రెండేళ్లయినా ప్రభుత్వం పనులు ప్రారంభించలేదు. వెంటనే ప్రాజెక్టు పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం ప్రాజెక్టు సందర్శన కార్యక్రమం చేపట్టారు. అయితే వేములవాడ నుంచి ప్రాజెక్టు వద్దకు వెళ్తున్న క్రమంలో పొన్నం ప్రభాకర్, వేములవాడ […]

Update: 2020-06-21 23:12 GMT

దిశ, కరీంనగర్: మాజీ ఎంపీ, టీ-పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని కథలాపూర్, మేడిపల్లి మండలాలకు సాగునీటిని అందించే కలికోట సూరమ్మ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి రెండేళ్లయినా ప్రభుత్వం పనులు ప్రారంభించలేదు. వెంటనే ప్రాజెక్టు పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం ప్రాజెక్టు సందర్శన కార్యక్రమం చేపట్టారు. అయితే వేములవాడ నుంచి ప్రాజెక్టు వద్దకు వెళ్తున్న క్రమంలో పొన్నం ప్రభాకర్, వేములవాడ ఇంఛార్జ్ ఆది శ్రీనివాస్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News