బీజేపీపై ’కొండా‘ ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠంగా కొనసాగుతున్న సమయంలో చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే సత్తా కేవలం బీజేపీకే ఉందని స్పష్టం చేశారు. ఓ వైపు కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే కొండా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. పోస్టు బ్యాలెట్ కౌంటింగ్‌లో బీజేపీ ఆధిక్యం సాధించడంతో కొండా విశ్వేశ్వరరెడ్డి ట్విట్టర్ వేదికగా ఈ కామెంట్స్ చేశారు. అయితే, ఇటీవల […]
దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠంగా కొనసాగుతున్న సమయంలో చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే సత్తా కేవలం బీజేపీకే ఉందని స్పష్టం చేశారు. ఓ వైపు కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే కొండా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. పోస్టు బ్యాలెట్ కౌంటింగ్‌లో బీజేపీ ఆధిక్యం సాధించడంతో కొండా విశ్వేశ్వరరెడ్డి ట్విట్టర్ వేదికగా ఈ కామెంట్స్ చేశారు. అయితే, ఇటీవల కొండా విశ్వేశ్వర రెడ్డి టీపీసీసీ పదవి రేవంత్ రెడ్డికి ఇవ్వకపోతే బీజేపీలో చేరుతారని వచ్చిన ఊహాగానాలకు ఆయన వ్యాఖ్యలు మరింత ఆయువు పోసినట్టు అయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇది ఇలా ఉంటే కాంగ్రెస్ గెలుపు కోసం రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నాలు అంతో ఇంతో ఉప్పల్ నియోజకవర్గంలో ఫలించాయి. సరిగ్గా ఇదే సమయంలో కొండా వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఓవైపు నేతలు పార్టీ ఉనికి కోసం తీవ్రంగా శ్రమిస్తుంటే.. చాలామంది నేతలు కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోికి చేరడంతో హస్తం పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్టు అయింది. కానీ, కొండా మాత్రం పార్టీలోనే ఉంటూ బీజేపీని పొగడడం ఏంటని కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు.