వెల్ఫేర్ బోర్డు నిధులు విడుదల చేయాలి : మాజీ ఎమ్మెల్సీ

దిశ, న్యూస్‌బ్యూరో: బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డులో సభ్యత్వం ఉన్న ప్రతి కార్మిక కుటుంబానికి ఆర్థిక సాయం కింద రూ. 2000 ఇవ్వాలని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల కష్టార్జితంతో కూడబెట్టిన నిధులను ప్రభుత్వం ఇతర సంస్థలకు మళ్లిస్తోందని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మానవ హక్కుల కమిషన్‌కు లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు నిధులు రూ. 300 కోట్లను […]

Update: 2020-04-20 06:54 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డులో సభ్యత్వం ఉన్న ప్రతి కార్మిక కుటుంబానికి ఆర్థిక సాయం కింద రూ. 2000 ఇవ్వాలని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల కష్టార్జితంతో కూడబెట్టిన నిధులను ప్రభుత్వం ఇతర సంస్థలకు మళ్లిస్తోందని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మానవ హక్కుల కమిషన్‌కు లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు నిధులు రూ. 300 కోట్లను సివిల్ సప్లయ్స్‌కు మళ్లించడం సరి కాదన్నారు.

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వత బోర్డు నుంచి ఇప్పటి వరకు వర్కర్ల సంక్షేమం కోసం ఒక్క రూపాయ కూడా ఖర్చుచేయలేదన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా పనులు లేక, తినడానికి తిండిలేక కార్మికులు నానా అవస్థలు పడుతుంటే వారి కష్టార్జితం వారికి ఇవ్వకుండా, ఇతర అవసరాలకు వాడటం.. కార్మికుల పట్ల ప్రభుత్వ వైఖరికి నిదర్శనమని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా బోర్డులో సభ్యత్వం ఉన్న పత్రి కార్మికునికి ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. సివిల్ సప్లయ్స్‌కు మళ్లించిన రూ. 300 కోట్లను బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డులో జమ చేసేలా లేబర్ కమిషనర్‌‌పై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల కమిషన్‌కు రాసిన లేఖలో కోరారు.

Tags : Welfare board, Building workers, Ex MLC, Labour commissioner, Civil Supplies

Tags:    

Similar News