అచ్చెనాయుడికి కోర్టులో చుక్కెదురు

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి ఏసీబీ కోర్టులో నిరాశ ఎదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. కొన్నిరోజుల కిందటే బెయిల్ పిటిషన్ పై వాదనలు జరగ్గా, తీర్పును న్యాయస్థానం రిజర్వులో ఉంచింది. అచ్చెన్నాయుడు ఆరోగ్యం బాగాలేదని, విచారణకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తారని ఆయన తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించినా..ఏసీబీ న్యాయస్థానం సంతృప్తి చెందలేదు. తాజాగా, ఈ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు ప్రకటించింది. అచ్చెన్న పిటిషన్‌ పై […]

Update: 2020-07-03 08:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి ఏసీబీ కోర్టులో నిరాశ ఎదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. కొన్నిరోజుల కిందటే బెయిల్ పిటిషన్ పై వాదనలు జరగ్గా, తీర్పును న్యాయస్థానం రిజర్వులో ఉంచింది. అచ్చెన్నాయుడు ఆరోగ్యం బాగాలేదని, విచారణకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తారని ఆయన తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించినా..ఏసీబీ న్యాయస్థానం సంతృప్తి చెందలేదు. తాజాగా, ఈ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు ప్రకటించింది.

అచ్చెన్న పిటిషన్‌ పై హైకోర్టులో ముగిసిన వాదనలు..

తాను అనారోగ్యంతో బాధపడుతున్నానంటూ అచ్చెన్న హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు ముగిశాయి. తనను ఆసుపత్రికి తరలించాలంటూ మాజీ మంత్రి ఈ పిటిషన్‌లో కోరారు. దీనిపై ఈ మధ్యాహ్నం వాదనలు జరిగాయి. తమ క్లయింటు దైనందిన కృత్యాలు తీర్చుకునేందుకు కూడా వీలుకాని పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని, మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించే ఆదేశాలు ఇవ్వాలని అచ్చెన్న తరఫు న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు.దీనిపై డిఫెన్స్ లాయర్ వాదిస్తూ, అచ్చెన్నాయుడికి పూర్తిస్థాయిలో చికిత్స జరిగిందని, మెరుగైన వైద్యం అందించామని వెల్లడించారు. మరే ఇతర వైద్యం అవసరంలేదని వాదించారు. ఈ పిటిషన్‌లో తీర్పు రేపు వెలువడనుంది.

Tags:    

Similar News