దీపక్‌కొచ్చర్‌కు బెయిల్ మంజూరు చేసిన ముంబై హైకోర్టు!
దిశ, వెబ్‌డెస్క్: ఐసీఐసీఐ బ్యాంక్, వీడీయోకాన్ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దీపక్ కొచ్చర్‌కు భారీ ఊరట లభించింది. ఈ కుంభకోణంలో బ్యాంకు మాజీ సీఎండీ చందాకొచ్చర్ భార్త దీపక్ కొచ్చర్‌కు ముంబై హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. మనీలాండరింగ్ ఆరోపణల కారణంగా గతేడాది సెప్టెంబర్‌లో దీపక్ కొచ్చర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. గత ఏడాది డిసెంబర్లోనే దీపక్ కొచ్చర్ బెయిల్ కోసం దరఖాస్తు చేయగా, ప్రత్యేక కోర్టు ఆయన అభ్యర్థనను తిరస్కరించింది. అనంతరం […]
దిశ, వెబ్‌డెస్క్: ఐసీఐసీఐ బ్యాంక్, వీడీయోకాన్ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దీపక్ కొచ్చర్‌కు భారీ ఊరట లభించింది. ఈ కుంభకోణంలో బ్యాంకు మాజీ సీఎండీ చందాకొచ్చర్ భార్త దీపక్ కొచ్చర్‌కు ముంబై హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. మనీలాండరింగ్ ఆరోపణల కారణంగా గతేడాది సెప్టెంబర్‌లో దీపక్ కొచ్చర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. గత ఏడాది డిసెంబర్లోనే దీపక్ కొచ్చర్ బెయిల్ కోసం దరఖాస్తు చేయగా, ప్రత్యేక కోర్టు ఆయన అభ్యర్థనను తిరస్కరించింది. అనంతరం దీపక్ కొచ్చర్ హైకోర్టును ఆశ్రయించారు. కాగా, ఐసీఐసీఐ బ్యాంక్ ద్వారా వీడియో కాన్ గ్రూపునకు మంజూరు చేసిన రుణాల్లో రూ. 1,875 కోట్ల వరకు అవినీతి జరిగిందని చందాకొచ్చర్ దంపతులపై మనీలాండరింగ్ కేసు నమోదైంది. ఈ కేసులో వీరితో పాటు వీడియోకాన్ గ్రూపునకు చెందిన వేణుగోపాల్‌పై కూడా కేసు ఉంది.