అన్ని నియోజక వర్గాల్లో వినాయక చవితి నిర్వహిస్తాం : చంద్రబాబు

దిశ, ఏపీ బ్యూరో: గణేష్ ఉత్సవాలకు ఆంక్షలు ఎందుకు పెడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైఎస్సార్ వర్దంతికి వర్తించని కొవిడ్ నిబంధనలు గణేష్ ఉత్సవాలకు ఏ విధంగా వర్తిస్తాయని నిలదీశారు. ఇడుపులపాయతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ వర్థంతికి వర్తించని కొవిడ్ నిబంధనలు వినాయక చవితికి ఏ విధంగా వర్తిస్తాయి.. అసలు వినాయక చవితి పూజలకు ఆంక్షలు ఏవిధంగా పెడతారని జగన్ తీరును తప్పుబట్టారు. తెలంగాణలో అనుమతించినప్పుడు.. ఏపీలో ఎందుకు అనుమతించరు? అని ప్రశ్నించారు. […]

Update: 2021-09-06 07:54 GMT

దిశ, ఏపీ బ్యూరో: గణేష్ ఉత్సవాలకు ఆంక్షలు ఎందుకు పెడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైఎస్సార్ వర్దంతికి వర్తించని కొవిడ్ నిబంధనలు గణేష్ ఉత్సవాలకు ఏ విధంగా వర్తిస్తాయని నిలదీశారు. ఇడుపులపాయతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ వర్థంతికి వర్తించని కొవిడ్ నిబంధనలు వినాయక చవితికి ఏ విధంగా వర్తిస్తాయి.. అసలు వినాయక చవితి పూజలకు ఆంక్షలు ఏవిధంగా పెడతారని జగన్ తీరును తప్పుబట్టారు. తెలంగాణలో అనుమతించినప్పుడు.. ఏపీలో ఎందుకు అనుమతించరు? అని ప్రశ్నించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే 175 నియోజకవర్గాల్లో ఈనెల 10న చవితి పూజా కార్యక్రమాలు నిర్వహించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Tags:    

Similar News