కరోనాపై గెలిచేందుకే లాక్‌డౌన్: మంత్రి సత్యవతి

దిశ, వరంగల్: కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌కు అందరూ సహకరించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ శ్రీరామ నవమిని ఇంట్లోనే ఉండి జరుపుకోవాలని కోరారు. ఇప్పటికే పూజారులు కూడా శ్రీరామ నవమిని ఏకాంతంగా జరపాలని నిర్ణయించడంతో ప్రజలు సహకరించాలన్నారు. శ్రీరాముని జీవితం అందరికీ ఆదర్శణీయమని, తండ్రి మాట కోసం […]

Update: 2020-04-01 21:50 GMT

దిశ, వరంగల్:
కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌కు అందరూ సహకరించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ శ్రీరామ నవమిని ఇంట్లోనే ఉండి జరుపుకోవాలని కోరారు. ఇప్పటికే పూజారులు కూడా శ్రీరామ నవమిని ఏకాంతంగా జరపాలని నిర్ణయించడంతో ప్రజలు సహకరించాలన్నారు. శ్రీరాముని జీవితం అందరికీ ఆదర్శణీయమని, తండ్రి మాట కోసం 14 ఏళ్లు వనవాసం చేశారని, అదే రీతిలో మన ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్ మాట మేరకు ఈ నెల 14వ తేదీ వరకు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించాలన్నారు.

Tags: everyone, self-control, warangal, coronavirus, minister satyavathi

Tags:    

Similar News