ఇందిరా, వాజ్‌పేయి లాంటి ఉద్ధండులే ఓడారు
ముంబయి: బీజేపీని టార్గెట్ చేస్తూ ఓటర్ల అభిప్రాయాలు తమ ఇష్టానుసారంగానే ఉంటాయన్న అహంకారానికి పోతే ఓటమి తప్పదని ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ విమర్శించారు. ఇందిరా గాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయి లాంటి ఉద్ధండ నేతలకే ఓటమి తప్పలేదని గుర్తుచేశారు. మహారాష్ట్ర గత అసెంబ్లీ ఎన్నికల్లో ‘మళ్లీ నేనే అధికారంలోకి వస్తా’ అన్న మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అహంకారాన్ని ప్రదర్శించారని, ఓటర్ల విశ్వాసాన్ని తన అభీష్టానికే వదిలేసినట్టు వ్యవహరించారని విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యంలో ఎప్పటికీ […]
ముంబయి: బీజేపీని టార్గెట్ చేస్తూ ఓటర్ల అభిప్రాయాలు తమ ఇష్టానుసారంగానే ఉంటాయన్న అహంకారానికి పోతే ఓటమి తప్పదని ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ విమర్శించారు. ఇందిరా గాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయి లాంటి ఉద్ధండ నేతలకే ఓటమి తప్పలేదని గుర్తుచేశారు. మహారాష్ట్ర గత అసెంబ్లీ ఎన్నికల్లో ‘మళ్లీ నేనే అధికారంలోకి వస్తా’ అన్న మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అహంకారాన్ని ప్రదర్శించారని, ఓటర్ల విశ్వాసాన్ని తన అభీష్టానికే వదిలేసినట్టు వ్యవహరించారని విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యంలో ఎప్పటికీ అధికారంలో ఉంటారని పగటి కలలు కనవద్దని అన్నారు. నేతలు అహంకారాన్ని ప్రదర్శిస్తే వారికి గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధమవుతారని శివసేన మౌత్‌పీస్ సామ్నా పత్రిక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అలాగే, మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీలో పొరపొచ్చాలు వస్తున్నాయన్న రిపోర్టులపై స్పందిస్తూ అవన్నీ నిరాధార కథనాలని కొట్టివేశారు. లాక్‌డౌన్ కాలం నుంచీ తాను సీఎంతో ఎప్పుడంటే అప్పుడు మాట్లాడగలుగుతున్నారని, ఇకపైనా ఆ సంభాషణ సాగుతుందని చెప్పారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం స్థిరంగానే ఉన్నదని, ఎటువంటి అనుమానాలు అక్కర్లేదని స్పష్టం చేశారు.