ఉద్యోగ భద్రత కల్పిస్తున్న కార్ల తయారీ కంపెనీలు!

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కార్ల తయారీ ప్లాంట్‌లను నిర్వహిస్తున్న యూరోపియన్ కార్ల సంస్థలు స్కోడా వోక్స్‌వ్యాగన్, రెనాల్ట్, ఇటీవల చైనా సొంతం చేసుకున్న ఎమ్‌జీ మోటార్ కంపెనీలు తమ ఉద్యోగుల ఉపశమనం కలిగించే వార్తనందించింది. తమ సంస్థల్లో పంచేసే ఎవరినీ ఉద్యోగం నుంచి తొలిగించమని ప్రకటించింది. దీనికి సంబంధించిన ప్రకటనలో ఉద్యోగ్లకిచ్చే జీతాల్లో కొట ఉండదని, పూర్తీ జీతం అందజేస్తామని, అలాగే ఎవరినీ ఉద్యోగాల నుంచి తొలగించే ప్రసక్తి లేదని ఆయా సంస్థలు స్పష్టం చేశాయి. కరోనా […]

Update: 2020-04-26 05:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కార్ల తయారీ ప్లాంట్‌లను నిర్వహిస్తున్న యూరోపియన్ కార్ల సంస్థలు స్కోడా వోక్స్‌వ్యాగన్, రెనాల్ట్, ఇటీవల చైనా సొంతం చేసుకున్న ఎమ్‌జీ మోటార్ కంపెనీలు తమ ఉద్యోగుల ఉపశమనం కలిగించే వార్తనందించింది. తమ సంస్థల్లో పంచేసే ఎవరినీ ఉద్యోగం నుంచి తొలిగించమని ప్రకటించింది. దీనికి సంబంధించిన ప్రకటనలో ఉద్యోగ్లకిచ్చే జీతాల్లో కొట ఉండదని, పూర్తీ జీతం అందజేస్తామని, అలాగే ఎవరినీ ఉద్యోగాల నుంచి తొలగించే ప్రసక్తి లేదని ఆయా సంస్థలు స్పష్టం చేశాయి. కరోనా వైరస్ వల్ల వ్యవస్థలో నగదు లభ్యత తగ్గిపోయినప్పటికీ, ఈ భారాన్ని ఉద్యోగుల వేసే ఆలోచనల లేదని, సకాలంలో వారికి జీతాలు అందేలా చూస్తామని వెల్లడించాయి.

ఇండియాలో రానున్న రోజుల్లో తమ వ్యాపారాన్ని మరింత విస్తరించే యోచనలో ఉన్నామని, దీనికోసం అధిక మొత్తంలో పెట్టుబడులతోపాటు కొత్త ఉత్పత్తులను ఇండియాలోకి తీసుకొస్తామని సంస్థలు ఉద్యోగుల్లో భరోసాను కల్పించాయి. వోక్స్‌వ్యాగన్ ఇండియా గ్రూప్ ప్లాంట్‌లలో పనిచేసే వారిలో 90 శాతం ఉద్యోగులకు బోనస్‌లను ప్రస్తుత పరిస్థితుల్లో ఆపేస్తామని, పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాక హామీ ఇచ్చినట్టుగా బోనస్‌లు ఇస్తామని హామీ ఇచ్చింది. దీని గురించి వోక్స్‌వ్యాగన్ ఇండియా ఎమ్‌డీ గురుప్రతాప్ మాట్లాడుతూ..కరోనా సంక్షోభం కారణంగా ఆటంకాలు ఉన్నప్పటికీ నిర్వహణ ఖర్చులు తగ్గించడం వల్ల ఉద్యోగుల వేతనాలను పూర్తీగా చెల్లిస్తూనే, ఉద్యోగ భద్రత కల్పిస్తున్నట్టు స్పష్టం చేశారు. అంతేకాకుండా, గతేడాది బోనస్‌లు కూడా ఇవ్వనున్నట్టు చెప్పామని వివరించారు.

రెనాల్ట్ ఇండియా ఎమ్‌డీ వెంకటరాం స్పందిస్తూ..కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన ఉద్యోగులెవరూ ఆందోళనపడొద్దని, అందరికీ ఉద్యోగ భద్రత ఉందని స్పష్టం చేశారు. అలాగే, తమ కంపెనీ డీలర్లకూ, ఉద్యోగులకూ జీతాల్లో కోత ఉండదని, అందరి ఉద్యోగాలను కాపాడుతామని, ఆ బాధ్యత తమదేనని ఎమ్‌జీ మోటార్స్ ఇండియా ప్రెసిడెంట్ రాజీవ్ స్పష్టం చేశారు.

Tags: Pay cut, skoda volkswagen, Volkswagen Group, covid impact, Renault India

Tags:    

Similar News