UEFA EURO 2021: యూరో కప్ 2021.. రేపటి నుంచే పండుగ

దిశ, స్పోర్ట్స్: ఫిఫా వరల్డ్ కప్ తర్వాత ఫుట్‌బాల్ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూసేది యూరో కప్ కోసమే. ఫుట్‌బాల్ ప్రపంచంలో యూరోపియన్ లీగ్స్ తర్వాత అత్యంత ఆదరణ పొందిన ఈవెంట్ యూరో కప్ మాత్రమే. సాకర్ అంటే లాటిన్ అమెరికా తర్వాత యూరోపియన్ దేశాల్లోనే ఆదరణ ఎక్కువ. యూరోప్‌లో ఫుట్‌బాల్ లీగ్స్ కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే వీటన్నింటి కంటే యూరోపియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్స్ (యూఈఎఫ్ఏ) Union of European Football Associations నిర్వహించే యూరోపియన్ […]

Update: 2021-06-09 08:43 GMT

దిశ, స్పోర్ట్స్: ఫిఫా వరల్డ్ కప్ తర్వాత ఫుట్‌బాల్ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూసేది యూరో కప్ కోసమే. ఫుట్‌బాల్ ప్రపంచంలో యూరోపియన్ లీగ్స్ తర్వాత అత్యంత ఆదరణ పొందిన ఈవెంట్ యూరో కప్ మాత్రమే. సాకర్ అంటే లాటిన్ అమెరికా తర్వాత యూరోపియన్ దేశాల్లోనే ఆదరణ ఎక్కువ. యూరోప్‌లో ఫుట్‌బాల్ లీగ్స్ కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే వీటన్నింటి కంటే యూరోపియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్స్ (యూఈఎఫ్ఏ) Union of European Football Associations నిర్వహించే యూరోపియన్ చాంపియన్‌షిప్ (యూరో కప్) European Football Championship కు అత్యంత ఆదరణ ఉన్నది. షెడ్యూల్ ప్రకారం యూరో కప్ గత ఏడాది జూన్ 12 నుంచి జులై 12 వరకు జరగాల్సి ఉన్నది. అయితే కరోనా మహమ్మారి కారణంగా యూరోప్ అంతటా లాక్‌డౌన్ ప్రకటించడంతో యూరో కప్ 2020ని ఏడాది పాటు వాయిదా వేశారు. దీంతో యూరో కప్ 2020 కాస్తా యూరో కప్ 2021గా మారి ఫుట్‌బాల్ ప్రేమికులను అలరించనున్నది. జూన్ 11 నుంచి జులై 11 వరకు యూరో కప్ 11 దేశాల్లో నిర్వహించనున్నారు. ఫ్రాన్స్‌లో నిర్వహించిన యూరో కప్ 2016లో క్రిస్టియానో రొనాల్డో సారథ్యంలోని పోర్చుగల్ చాంపియన్‌గా నిలిచింది. ఈ సారి డిఫెండింగ్ చాంపియన్ పోర్చ్‌గల్‌తో సహా 24 జట్లు అర్హత సాధించాయి. నెల రోజుల పాటు జరుగనున్న యూరో కప్‌ 11 వేదికల్లో నిర్వహించనుండగా.. మొత్తం 51 మ్యాచ్‌లు జరుగనున్నాయి.

60 Years Euro Cup

ఐరోపా ఖండంలోని దేశాల మధ్య జరిగే ఫుట్‌బాల్ సమరమే యూరోపియన్ చాంపియన్‌షిప్. యూఈఎఫ్ఏ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మెగా టోర్నీని ముద్దుగా యూరోకప్ అని పిలుస్తుంటారు. 1958లో మొదటి సారిగా ఈ మెగా చాంపియన్‌షిప్‌ను ప్రారంభించారు. ప్రతీ ఏడాది ఒక దేశంలో యూరో కప్‌ను నిర్వహిస్తూ వస్తున్నారు. చిన్నదేశాలు ఈ మెగా టోర్నీకి ఓకే సారి ఆతిథ్యం ఇవ్వలేవని ఆలోచించి కొన్ని సార్లు రెండు దేశాలకు సంయుక్తం ఆతిథ్యపు హక్కులు ఇచ్చారు. యూరోకప్ చరిత్రలో తొలిసారిగా 2000లో బెల్జియం, నెదర్లాండ్స్ ఆతిథ్యం ఇచ్చాయి. కాగా, 2018తో యూరో కప్ 60 ఏళ్లు పూర్తి చేసుకున్నది. కాబట్టి 2020లో యూరో కప్‌ను యూరోప్ అంతటా నిర్వహించాలని 2012లో జరిగిన సమావేశంలో నిర్వహించారు. షెడ్యూల్ ప్రకారం 2020 యూరో కప్ 11 దేశాల్లోని వేదికల్లో నిర్వహించాల్సి ఉన్నది. కానీ కరోనా కారణంగా ఏడాది పాటు వాయిదా పడటంతో 2021 జూన్ 11 నుంచి ప్రారంభించనున్నారు. యూరో కప్ 2021కి 24 జట్లు అర్హత సాధించగా వాటిని 6 గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ మ్యాచ్‌లు జూన్ 11 నుంచి 23 వరకు జరుగనుండగా.. నాకౌట్ మ్యాచ్‌లు జూన్ 26 నుంచి 29 వరకు, క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు జులై 2, 3న సెమీఫైనల్ మ్యాచ్‌లు జులై 6, 7న నిర్వహించనున్నారు. ఫైనల్ మ్యాచ్ మ్యాచ్ జులై 11న జరుగనున్నది.

ఏ గ్రూప్‌లో ఏ జట్లు ఉన్నాయి?

గ్రూప్ ఏ : టర్కీ, ఇటలీ, వేల్స్, స్విట్జర్లాండ్
గ్రూప్ బి : డెన్మార్క్, ఫిన్లాండ్, బెల్జియం, రష్యా
గ్రూప్ సి : నెదర్లాండ్స్, ఉక్రెయిన్, ఆస్ట్రియా, నార్త్ మాసిడోనియా
గ్రూప్ డి : ఇంగ్లాండ్, క్రొయేషియా, స్కాట్లాండ్, చెక్ రిపబ్లిక్
గ్రూప్ ఈ : స్పెయిన్, స్వీడన్, పోలాండ్, స్లోవేకియా
గ్రూప్ ఎఫ్ : హంగేరి, పోర్చుగల్, ఫ్రాన్స్, జర్మని

గ్రూప్ మ్యాచ్‌ల షెడ్యూల్..

జూన్ 11 : టర్కీ Vs ఇటలీ
జూన్ 12 : వేల్స్ Vs స్విట్జర్లాండ్, డెన్మార్క్ Vs ఫిన్లాండ్, బెల్జియం Vs రష్యా
జూన్ 13 : ఆస్ట్రియా Vs నార్త్ మాసిడోనియా, నెదర్లాండ్స్ Vs ఉక్రెయిన్, ఇంగ్లాండ్ Vs క్రొయేషియా
జూన్ 14 : స్కాట్లాండ్ Vs చెక్ రిపబ్లిక్, పోలాండ్ Vs స్లోవేకియా, స్పెయిన్ Vs స్వీడన్
జూన్ 15 : హంగేరి Vs పోర్చుగల్, ఫ్రాన్స్ Vs జర్మని
జూన్ 16 : టర్కీ Vs వేల్స్, ఇటలీ Vs స్విట్జర్లాండ్, ఫిన్లాండ్ Vs రష్యా
జూన్ 17 : డెన్మార్క్ Vs బెల్జియం, ఉక్రెయిన్ Vs నార్త్ మాసిడోనియా, నెదర్లాండ్స్ Vs ఆస్ట్రియా
జూన్ 18 : క్రొయేషియా Vs చెక్ రిపబ్లిక్, ఇంగ్లాండ్ Vs స్కాట్లాండ్, స్వీడన్ Vs స్లోవేకియా
జూన్ 19 : స్పెయిన్ Vs పోలాండ్, హంగేరి Vs ఫ్రాన్స్, పోర్చుగల్ Vs జర్మనీ
జూన్ 20 : స్విట్జర్లాండ్ Vs టర్కీ, ఇటలీ Vs వేల్స్
జూన్ 21 : రష్యా Vs డెన్మార్క్, ఫిన్లాండ్ Vs బెల్జియం, నార్త్ మాసిడోనియా Vs నెదర్లాండ్స్, ఉక్రెయిన్ Vs ఆస్ట్రియా
జూన్ 22 : క్రొయేషియా Vs స్కాట్లాండ్, చెక్ రిపబ్లిక్ Vs ఇంగ్లాండ్
జూన్ 23 : స్లోవేకియా Vs స్పెయిన్, స్వీడన్ Vs పోలాండ్, పోర్చుగల్ Vs ఫ్రాన్స్, జర్మనీ Vs హంగేరి

ఆతిథ్య నగరాలు – స్టేడియంలు

లండన్ – వింబ్లే స్టేడియం
రోమ్ – ఒలింపిక్ స్టేడియం
మ్యూనిచ్ – అలియన్జ్ ఎరేనా
బాకు – ఒలింపిక్ స్టేడియం
సెయింట్ పీటర్స్‌బర్గ్ – క్రిస్టోవ్‌స్కీ స్టేడియం
బుడాపెస్ట్ – పుస్కాస్ ఎరేనా
బుచారెస్ట్ – నేషనల్ ఎరేనా
సివిల్లే – సివిల్లే స్టేడియం
కోపెన్ హెగాన్ – పార్కెన్ స్టేడియం
అమె‌స్టర్‌డామ్ – జోహాన్ క్రూఫీ ఎరేనా
గ్లాస్గో – హాంప్‌డెన్ పార్క్

Tags:    

Similar News