కేసీఆర్ నియంతృత్వ పాలనకు ఘోరీ కట్టడమే నా లక్ష్యం : ఈటల

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా నేపథ్యంలో ఈ రోజు ఉదయం గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఈటల సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. హుజురాబాద్‌లో రానున్న ఉపఎన్నికలు కురుక్షేత్రాన్ని తలపిస్తాయని ఈటల అన్నారు. ఎన్నికల్లో గెలిచి కేసీఆర్‌కు బుద్డి చెప్పే రోజులు దగ్గరపడ్డాయన్నారు. కేసీఆర్ నియంతృత్వ పాలనకు ఘోరీ కట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని ఈటల రాజేందర్ అన్నారు. టీఆర్‌ఎస్ బీ ఫారం ఇచ్చి […]

Update: 2021-06-12 00:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా నేపథ్యంలో ఈ రోజు ఉదయం గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఈటల సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. హుజురాబాద్‌లో రానున్న ఉపఎన్నికలు కురుక్షేత్రాన్ని తలపిస్తాయని ఈటల అన్నారు. ఎన్నికల్లో గెలిచి కేసీఆర్‌కు బుద్డి చెప్పే రోజులు దగ్గరపడ్డాయన్నారు. కేసీఆర్ నియంతృత్వ పాలనకు ఘోరీ కట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని ఈటల రాజేందర్ అన్నారు. టీఆర్‌ఎస్ బీ ఫారం ఇచ్చి ఉండొచ్చు.. కానీ గెలిపించింది ప్రజలేనన్నారు.

తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేశా, ఉద్యమాలు, కేసులు కొత్తేమీ కాదని, ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్ లో చేరిన వాళ్లు మంత్రులుగా కొనసాగుతున్నారన్నారు. సీఎం కేసీఆర్‌ దగ్గర వందల వేల కోట్ల రూపాయలు ఉన్నాయని ఆరోపణలు చేశారు. వందల వేలకోట్ల అక్రమ సంపాదనతో అధికార దుర్వినయోగం చేస్తున్నారని విమర్శలు చేశారు. ఇదిలా ఉండగా మరికాసేపట్లో ఎమ్మెల్యే రాజీనామా లేఖను స్పీకర్ కార్యాలయంలో అందజేయనున్నారు.

Full View

Tags:    

Similar News