ట్రెండింగ్ ‌న్యూస్.. సోషల్ మీడియాలో ఈటల రాజేందర్ వైరల్

దిశ, వెబ్‌డెస్క్: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కౌంటింగ్‌ నేపథ్యంలో తెలంగాణలో పొలిటికల్ హీట్‌ పెరిగింది. ఓట్ల లెక్కింపులో రౌండ్‌ రౌండ్‌కి ఈటల రాజేందర్‌ ఆధిక్యం పెరుగుతూనే ఉంది. గెల్లు శ్రీనివాస్‌కు కూడా ప్రతి రౌండ్‌లో కనీస ఓట్లు వచ్చాయనే చెప్పాలి. కానీ, 15 రౌండ్లలో గట్టి పోటీ మాత్రం కనబడలేదు. దీంతో బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నేతలే కాదు ఏకంగా సోషల్ మీడియాలో ఈటల పేరు మారుమోగుతోంది. ట్రెండింగ్‌ ఇన్ […]

Update: 2021-11-02 05:22 GMT
ట్రెండింగ్ ‌న్యూస్.. సోషల్ మీడియాలో ఈటల రాజేందర్ వైరల్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కౌంటింగ్‌ నేపథ్యంలో తెలంగాణలో పొలిటికల్ హీట్‌ పెరిగింది. ఓట్ల లెక్కింపులో రౌండ్‌ రౌండ్‌కి ఈటల రాజేందర్‌ ఆధిక్యం పెరుగుతూనే ఉంది. గెల్లు శ్రీనివాస్‌కు కూడా ప్రతి రౌండ్‌లో కనీస ఓట్లు వచ్చాయనే చెప్పాలి. కానీ, 15 రౌండ్లలో గట్టి పోటీ మాత్రం కనబడలేదు. దీంతో బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నేతలే కాదు ఏకంగా సోషల్ మీడియాలో ఈటల పేరు మారుమోగుతోంది. ట్రెండింగ్‌ ఇన్ ఇండియాలో ఈటల రాజేందర్ గెలుపు, హుజూరాబాద్‌ హ్యాష్‌ ట్యాగ్‌లతో బీజేపీ శ్రేణులు ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. వాట్సాప్‌లల్లో స్టేటస్‌లు మొత్తం ఈటలవే కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ ఊసే ఎవరూ ఎత్తడం లేదని సెటైర్లు వేసుకుంటున్నారు బీజేపీ శ్రేణులు. ఇదిలా ఉంటే 22 రౌండ్లు పూర్తి కాక ముందే ఈటల గెలిచారు అంటూ ఆ పార్టీ నాయకులు ప్రకటించుకోవడం విశేషం.

https://twitter.com/search?q=#EtelaRajender&src=trend_click&vertical=trends

 

Tags:    

Similar News