కరోనాపై పోరుకు సంసిద్ధం: ఈటల
దిశ, వెబ్‌డెస్: మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీకి అనుబంధంగా మరో వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మిస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆ ఆస్పత్రిని కూడా అతి తక్కువ కాలంలోనే పూర్తి చేస్తామని చెప్పారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ ఎకో పార్క్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం ప్రభుత్వ వైద్య కళాశాల భవనాల సముదాయాన్ని కేటీఆర్ ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి […]
దిశ, వెబ్‌డెస్: మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీకి అనుబంధంగా మరో వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మిస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆ ఆస్పత్రిని కూడా అతి తక్కువ కాలంలోనే పూర్తి చేస్తామని చెప్పారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ ఎకో పార్క్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం ప్రభుత్వ వైద్య కళాశాల భవనాల సముదాయాన్ని కేటీఆర్ ప్రారంభించారు.
తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి మహబూబ్‌నగర్ జిల్లా అని ఈటల రాజేందర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కరువు కటకాలతో, వలసలతో తల్లడిల్లిన జిల్లా మహబూబ్‌నగర్ అని చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక కరువు జిల్లా అనే పేరు తుడిచేశామన్నారు. ప్రజానీకానికే అన్నం పెట్టే దిశగా మహబూబ్‌నగర్ ఎదిగిందన్నారు. దేశానికే అన్నం పెట్టే దిశగా తెలంగాణ అగ్రస్థానంలో ఉందని ఈటల కొనియాడారు. అటు వైద్య రంగంలో కూడా తక్కువ కాలంలో ఎక్కువ ఫలితాలు సాధించిందని తెలిపారు. గత ఆరు సవంత్సరాలలో అనేక మెడికల్ కాలేజీలను తీసుకొచ్చామన్నారు. వైద్యరంగంలో దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో నిలిచిందన్నారు.
అగ్రదేశాలపై కరోనా ప్రభావాన్ని తెలంగాణ ప్రభుత్వం పరశీలిస్తోందని ఈటల అన్నారు. గత రెండు మూడు నెలలుగా వైరస్‌ను సంసిద్ధంగా ఎదుర్కున్నామన్నారు. ర్యాపిట్ టెస్ట్ కిట్ లను కూడా అందుబాటులోకి తెచ్చామని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ కరోనా పోరుపై ఎన్ని డబ్బులు ఖర్చైన వెనుకడుగు వేయకుండా అండగా నిలుస్తున్నారని ఈటల రాజేందర్ కొనియాడారు. అలాగే రాష్ట్ర ప్రజలు కూడా కరోనా కట్టడికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.