చైతన్యాన్ని చంపాలని చూస్తే ఇక ఉన్మాదమే : ఈటల
దిశ, ముషీరాబాద్ : చైతన్యాన్ని ఎక్కడైనా చంపాలని చూస్తే తదుపరి ఉన్మాదమే పుట్టుకొస్తుందని రాష్ట్ర వైద్యారోగ్య మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కులాల ప్రాతిపదికన రాజకీయాలు జరిగే దుర్మార్గపు ఆలోచన ఇక్కడే ఉందని ఇప్పటికైనా మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇది ఆత్మగౌరవ సమస్య అని, మన ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కింది కులాల మీదే ఉందన్నారు. బీసీ సంఘాల ఆధ్వర్యంలో శనివారం సుందరయ్య విజ్జాన కేంద్రంలో సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి […]
దిశ, ముషీరాబాద్ : చైతన్యాన్ని ఎక్కడైనా చంపాలని చూస్తే తదుపరి ఉన్మాదమే పుట్టుకొస్తుందని రాష్ట్ర వైద్యారోగ్య మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కులాల ప్రాతిపదికన రాజకీయాలు జరిగే దుర్మార్గపు ఆలోచన ఇక్కడే ఉందని ఇప్పటికైనా మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇది ఆత్మగౌరవ సమస్య అని, మన ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కింది కులాల మీదే ఉందన్నారు. బీసీ సంఘాల ఆధ్వర్యంలో శనివారం సుందరయ్య విజ్జాన కేంద్రంలో సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య 94వ జయంతి వేడుకల్లో భాగంగా ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సమాజానికి, మట్టికి తిరుగుబాటు చేసే స్వభావం ఉంటుందన్నారు. ‘ఉద్యమాలను అణచివేసే శక్తి ఎవరికీ లేదని, చైతన్యాన్ని చంపితే ఉన్మాదమే వస్తుందని’ చెప్పారు. తెలంగాణ సాయుధ పోరాట చైతన్యం యావత్ దేశానికి చైతన్యాన్ని ఇచ్చిందని తెలిపారు. అధికారుల పొరపాటు వల్ల భూ సమస్యల్లో కొన్ని తప్పిదాలు జరుగుతున్నాయన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పథకాలు ఉండాలి కాని ఎలక్షన్ ఓరియంటెడ్ పథాకాలు ఉండకూడదని చెప్పారు. ప్రపంచంలో అన్నింటికంటే విలువైంది ప్రాణమని, సమాజం కోసం ప్రాణ త్యాగం చేసిన గొప్ప వ్యక్తి దొడ్డి కొమురయ్య అని కొనియాడారు.
ఆ మహనీయుని విగ్రహాన్ని పెట్టకోవాల్సిన అవసరం ఉందని, ట్యాంక్ బండ్ పై దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేసే విషయాన్ని సీఎం కేసీఆర్ మాట్లాడతానన్నారు. అణగారిన ప్రజల సమస్యలపై పోరాటం చేయడంతో పాటు పేదల కోసం అసెంబ్లీలో మాట్లాడిన వ్యక్తి నోముల నర్సింహయ్య అని గుర్తు చేశారు. ఆయన కుమారుడు భగత్ కి టీఆర్ఎస్ పార్టీ నాగార్జున సాగర్ లో టికెట్ ఇచ్చిందని, ఆయనను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.