ప్రజలు చరిత్ర తిరగరాశారని భావిస్తున్నా.. ఈటల కీలక వ్యాఖ్యలు

దిశ, హుజురాబాద్ రూరల్: తెరాస ఎన్ని కుట్రలు చేసినా ధైర్యంగా ముందుకొచ్చి ఓటర్లు తనను ఆశీర్వదించారని హుజూరాబాద్‌ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ తెలిపారు. పోలింగ్‌ ముగిసిన అనంతరం భాజపా నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ‘‘అన్ని ఉప ఎన్నికల్లో మాదిరిగా ఇక్కడ కూడా ఓటర్లకు డబ్బులు పంచి, అసత్య వాగ్దానాలు చేసి గెలవొచ్చని కేసీఆర్‌ ప్రయత్నించారు. కానీ, హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలు చరిత్రను తిరగరాశారని భావిస్తున్నా. కేసీఆర్‌ కుట్రను హుజూరాబాద్‌ ప్రజలు అర్థం […]

Update: 2021-10-30 11:20 GMT

దిశ, హుజురాబాద్ రూరల్: తెరాస ఎన్ని కుట్రలు చేసినా ధైర్యంగా ముందుకొచ్చి ఓటర్లు తనను ఆశీర్వదించారని హుజూరాబాద్‌ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ తెలిపారు. పోలింగ్‌ ముగిసిన అనంతరం భాజపా నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ‘‘అన్ని ఉప ఎన్నికల్లో మాదిరిగా ఇక్కడ కూడా ఓటర్లకు డబ్బులు పంచి, అసత్య వాగ్దానాలు చేసి గెలవొచ్చని కేసీఆర్‌ ప్రయత్నించారు. కానీ, హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలు చరిత్రను తిరగరాశారని భావిస్తున్నా. కేసీఆర్‌ కుట్రను హుజూరాబాద్‌ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఉప ఎన్నిక కోసం తెరాస రూ.400 నుంచి రూ.500 కోట్లు ఖర్చు పెట్టింది. అయినా ధర్మం, ప్రజాస్వామ్యాన్ని, ఈటలను కాపాడుకోవాలని ప్రజలు భావించారు. హుజూరాబాద్‌ ఓటర్లకు ధన్యవాదాలు. హుజూరాబాద్‌ మొదటి నుంచి చైతన్యవంతమైన గడ్డ. అన్యాయాన్ని, ఆధిపత్యాన్ని సహించే గడ్డ కాదు. ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్‌, అర్వింద్‌, విజయశాంతి, డీకే అరుణ, కేంద్రమంత్రులు, జాతీయ నేతలకు కృతజ్ఞతలు. కష్టపడి పనిచేసిన నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు’’ అని ఈటల రాజేందర్‌ తెలిపారు.

Tags:    

Similar News