అలర్జీలు పెరుగుతున్నాయ్​.. ప్రత్యేక క్లీనిక్‌లు ఏర్పాటు

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా అలర్జీలు పెరుగుతున్నాయని స్వయంగా వైద్యారోగ్యశాఖ సూచిస్తున్నది. సుమారు 30 శాతం మంది జనాభాలో వివిధ రూపాల్లో అలర్జీలు వస్తున్నాయని స్పష్టం చేసింది. వీటిలో ఎక్కువగా చర్మ, శ్వాసకు సంబంధించిన సమస్యలు వస్తున్నట్లు ఆరోగ్యశాఖ అంతర్గతంగా రిపోర్టును తయారు చేసింది. జీవనశైలీ మార్పులు, విపరీతంగా పెరిగిన కాలుష్యంతో ప్రబలుతున్నట్లు పేర్కొన్నది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని టీచింగ్​ ఆసుపత్రుల్లో అలర్జీ క్లినిక్​లను అందుబాటులోకి తెచ్చేందుకు సర్కార్​ ప్లాన్​ చేస్తున్నది. దీనిలో భాగంగా చెస్ట్ ​ఆసుపత్రిలో […]

Update: 2021-10-06 18:47 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా అలర్జీలు పెరుగుతున్నాయని స్వయంగా వైద్యారోగ్యశాఖ సూచిస్తున్నది. సుమారు 30 శాతం మంది జనాభాలో వివిధ రూపాల్లో అలర్జీలు వస్తున్నాయని స్పష్టం చేసింది. వీటిలో ఎక్కువగా చర్మ, శ్వాసకు సంబంధించిన సమస్యలు వస్తున్నట్లు ఆరోగ్యశాఖ అంతర్గతంగా రిపోర్టును తయారు చేసింది. జీవనశైలీ మార్పులు, విపరీతంగా పెరిగిన కాలుష్యంతో ప్రబలుతున్నట్లు పేర్కొన్నది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని టీచింగ్​ ఆసుపత్రుల్లో అలర్జీ క్లినిక్​లను అందుబాటులోకి తెచ్చేందుకు సర్కార్​ ప్లాన్​ చేస్తున్నది. దీనిలో భాగంగా చెస్ట్ ​ఆసుపత్రిలో ప్రయోగాత్మకంగా తొలి అలర్జీ కేంద్రాన్ని 120 పడకలతో బుధవారం ప్రారంభించారు.

జిల్లాల్లో 100 పడకలతో…

సిద్ధిపేట్​, వరంగల్​ జిల్లాల్లోనూ అలర్జీ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. వీటిని ఒక్కో కేంద్రంలో సుమారు 100 పడకలతో సిద్ధం చేయనున్నారు. వీటి పరిశీలన అనంతరం క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని టీచింగ్​ ఆసుపత్రుల్లో అందుబాటులోకి తేనున్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొన్నది. ఇమ్యూనాలజిస్ట్​ల​ ఆధ్వర్వంలో అలర్జీలకు చికిత్స నిర్వహిస్తారు. చర్మ, శ్వాస తదితర రకాల అలర్జీలకు ఈ కేంద్రాల్లో చికిత్సను అందిస్తారు. ప్రస్తుతం అలర్జీ ట్రీట్మెంట్​ లకు ప్రైవేట్​ లో ప్రత్యేక విభాగాలు ఉన్నాయి. కానీ అక్కడ చికిత్స చాలా ఖరీదుగా ఉన్నది. దీంతో సీఎం కేసీఆర్​ సూచనతో ఈ నిర్ణయం తీసుకున్నామని వైద్యారోగ్యశాఖ అధికారులు స్పష్టం చేశారు.

Tags:    

Similar News