ఖమ్మంలో కరోనా శాంపిల్ టెస్టింగ్ బాక్సులు
దిశ, ఖమ్మం: రాష్ట్రంలోనే ప్రపథమంగా కరోనా టెస్టింగ్ ల్యాబ్స్‌ను ఖమ్మం జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేశారు. భవిష్యత్‌లో కరోనా తీవ్రత పెరిగినా, ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా, అందుకు తగ్గట్టుగా సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను సమాయత్తం చేస్తోంది. అందులో భాగంగానే కరోనా శాంపిల్స్ టెస్టింగ్ బాక్సుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇకపై ఎలాంటి పీపీఈ కిట్లు వాడకుండానే ఆ బాక్సులో నుంచే శాంపిళ్లను సేకరిస్తారు. ఇప్పటికే మూడు బాక్సులను ఖమ్మం జిల్లా ఆస్పత్రికి తరలించిన […]
దిశ, ఖమ్మం: రాష్ట్రంలోనే ప్రపథమంగా కరోనా టెస్టింగ్ ల్యాబ్స్‌ను ఖమ్మం జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేశారు. భవిష్యత్‌లో కరోనా తీవ్రత పెరిగినా, ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా, అందుకు తగ్గట్టుగా సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను సమాయత్తం చేస్తోంది. అందులో భాగంగానే కరోనా శాంపిల్స్ టెస్టింగ్ బాక్సుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇకపై ఎలాంటి పీపీఈ కిట్లు వాడకుండానే ఆ బాక్సులో నుంచే శాంపిళ్లను సేకరిస్తారు. ఇప్పటికే మూడు బాక్సులను ఖమ్మం జిల్లా ఆస్పత్రికి తరలించిన వైద్య ఆరోగ్యశాఖ త్వరలోనే మరో పది బాక్సులను పంపించినున్నట్టు కలెక్టర్ కర్ణన్ ఓ ప్రకటనలో తెలిపారు.
Tags: Establishment, Corona, sample testing boxes, Khammam, collector