హాట్‌బ్యూటీ టాప్ లెస్ ఫోజులు.. హాట్ కామెంట్లకు స్వీట్ వార్నింగ్..
దిశ, సినిమా: బాలీవుడ్ హాట్ బ్యూటీ ఈషా గుప్తా.. తన టాప్‌లెస్ పిక్చర్స్‌ను టార్గెట్ చేస్తూ నెటిజన్లు చేస్తోన్న ట్రోల్స్‌పై స్పందించింది. హీరోయిన్‌గానే కాకుండా స్పెషల్ సాంగ్స్‌లోనూ అభిమానులను అలరిస్తున్న ఈ బోల్డ్ బ్యూటీ ఇటీవల ‘సన్ బాత్’ అంటూ టాప్‌లేస్ ఫొటోలు షేర్ చేసి నెటిజన్ల మతి పోగొట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొందరు ఆమె హాట్ పిక్స్ చూసి పాజిటివ్‌గా రెస్పాండ్ కాగా.. మరికొందరు తీవ్రస్థాయిలో విమర్శిస్తూ, ట్రోల్ చేస్తూ తన పోస్ట్‌పై […]
దిశ, సినిమా: బాలీవుడ్ హాట్ బ్యూటీ ఈషా గుప్తా.. తన టాప్‌లెస్ పిక్చర్స్‌ను టార్గెట్ చేస్తూ నెటిజన్లు చేస్తోన్న ట్రోల్స్‌పై స్పందించింది. హీరోయిన్‌గానే కాకుండా స్పెషల్ సాంగ్స్‌లోనూ అభిమానులను అలరిస్తున్న ఈ బోల్డ్ బ్యూటీ ఇటీవల ‘సన్ బాత్’ అంటూ టాప్‌లేస్ ఫొటోలు షేర్ చేసి నెటిజన్ల మతి పోగొట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొందరు ఆమె హాట్ పిక్స్ చూసి పాజిటివ్‌గా రెస్పాండ్ కాగా.. మరికొందరు తీవ్రస్థాయిలో విమర్శిస్తూ, ట్రోల్ చేస్తూ తన పోస్ట్‌పై అసభ్యకరంగా కామెంట్స్ చేశారు.
ఈ నేపథ్యంలో తనపై వచ్చిన ట్రోల్స్‌పై స్పందిస్తూ నెటిజన్లను ప్రశ్నించింది. ‘సోషల్ మీడియాలో నాపై వచ్చే ట్రోల్స్ చూసి ఇప్పటిదాకా బాధపడేదాన్ని. కానీ ఇకముందు అలాంటి వాటిని పట్టించుకోను. పనికిరాని వాళ్ల ట్రోల్స్‌కు అసలు స్పందించకూడదని బలంగా నిర్ణయించుకున్నా. నేను ఏ పనిచేసినా కొందరు అదే పనిగా నా వైపు వేలెత్తి చూపుతున్నారు. ఇటీవల నేను షేర్ చేసిన పిక్స్‌కు అసభ్యకర కామెంట్స్ చేశారు. అందుకే స్పందించక తప్పడం లేదు. చాలామంది హీరోలు షర్ట్ లేకుండా ఫొటోలు షేర్ చేస్తే.. మీ బాడీ సూపర్బ్‌గా ఉంది అంటూ కామెంట్ చేస్తారు. మరి పూర్తి దుస్తులు ధరించమని వాళ్లకు ఎందుకు చెప్పరు. ఎందుకు లింగ వివక్ష చూపుతున్నారు. చీర ధరించి ఫొటో షేర్ చేస్తే.. ఈరోజు మీరు పూర్తి దుస్తులు ధరించారు అని వెటకారం చేస్తారు.
మేకప్ ధరించిన ఫొటోలను పంచుకుంటే ‘ప్లాస్టిక్ బ్యూటీ’ అని కామెంట్లు పెడతారు. మేకప్ లేని ఫొటోలను షేర్ చేస్తే.. నువ్వు అందంగా లేవు. ముఖానికి మేకప్ వేసుకో అని సలహాలు ఇస్తారు. ఇలా రకరకాలుగా ప్రపంచవ్యాప్తంగా ఆడవాళ్లపై వివక్ష కొనసాగుతునే ఉంది. మహిళలలకు సంబంధించి మన ఆలోచనల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఇక నా విషయానికొస్తే.. నేను మానసికంగా చాలా స్ర్టాంగ్ పర్సన్‌ని. ఎవరైనా ఒకసారి నా చెంపమీద కొడితే నేను రెండుసార్లు తిరిగి కొడతాను. మన ఆలోచనలు, మనం మరింత ఆదర్శవంతంగా మారాల్సిన అవరముందని కోరుకుంటున్నాను’ అంటూ నెటిజన్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది ఈషా గుప్తా.