ఎల్ఏసీ బార్డర్‌లో తగ్గేది లేదు
న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దు ఎల్ఏసీ వద్ద కొన్నాళ్లుగా సాగుతున్న ఉద్రిక్తతలు సమసిపోయేలా లేవు. చైనాకు ధీటుగా మోహరించిన భారత సైనికులు వెనక్కి తగ్గబోరని తెలుస్తున్నది. ప్రధాని నరేంద్ర మోడీ త్రిదళాధిపతి బిపిన్ రావత్ సహా మూడు దళాల చీఫ్‌లు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌లతో మంగళవారం భేటీ అయిన సంగతి తెలిసిందే. అంతకుముందే రావత్, మూడు దళాల చీఫ్‌లు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమయ్యారు. మిలిటరీ బాస్‌లు సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులను ప్రధాని నరేంద్ర మోడీ, […]
న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దు ఎల్ఏసీ వద్ద కొన్నాళ్లుగా సాగుతున్న ఉద్రిక్తతలు సమసిపోయేలా లేవు. చైనాకు ధీటుగా మోహరించిన భారత సైనికులు వెనక్కి తగ్గబోరని తెలుస్తున్నది. ప్రధాని నరేంద్ర మోడీ త్రిదళాధిపతి బిపిన్ రావత్ సహా మూడు దళాల చీఫ్‌లు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌లతో మంగళవారం భేటీ అయిన సంగతి తెలిసిందే. అంతకుముందే రావత్, మూడు దళాల చీఫ్‌లు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమయ్యారు. మిలిటరీ బాస్‌లు సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులను ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లకు వివరించినట్టు సమాచారం. ఈ చర్చల అనంతరం కూడా సరిహద్దుల్లో చైనాకు ధీటుగానే మన దేశ సైనికుల మోహరింపులు కొనసాగాయి. కానీ, తగ్గలేదు. చైనా దూకుడుగా తగినట్టుగానే భారత్ వ్యవహరిస్తుందని సంబంధితవర్గాలు కొన్ని వివరించాయి. కాగా, సరిహద్దులో ఉత్తర సిక్కిం, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, లడాఖ్ ప్రాంతాల్లో ఇరుదేశాలకు చెందిన కమాండర్ స్థాయి అధికారులు ఆరుసార్లు చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయాయి. అయితే, ఈ ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఉన్నతస్థాయి కమాండర్‌లు మరోసారి చర్చలు జరపనున్నట్టు తెలిసింది. కాగా, ఇరుదేశాల మధ్య సమస్యను పరిష్కరానికి మధ్యవర్తిత్వం వహించేందుకు అమెరికా ఆసక్తి చూపింది. ఈ విషయమై ఇరుదేశాలకు తమ అభిప్రాయాన్ని తెలిపినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.