బీజేపీకి.. ఎర్ర‌బెల్లి ఛాలెంజ్ !

దిశ,న్యూస్‌బ్యూరో‌ : దేశంలో రైతాంగానికి సీఎం కేసీఆర్ చేసినంత మేలు ఏ ముఖ్యమంత్రీ చేయలేదు.. దమ్ముంటే కాదని మీరు నిరూపించగలరా? అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీజేపీ నేతలకు ఛాలెంజ్ విసిరారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా రైతుల పంటకు కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారా.. చెప్పాలని ప్రశ్నించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం సీఎం కేసీఆర్‌ నిర్ణయాలను కొనియాడారన్నారు. కానీ, ఇక్కడ బీజేపీ […]

Update: 2020-04-24 10:28 GMT
బీజేపీకి.. ఎర్ర‌బెల్లి ఛాలెంజ్ !
  • whatsapp icon

దిశ,న్యూస్‌బ్యూరో‌ :
దేశంలో రైతాంగానికి సీఎం కేసీఆర్ చేసినంత మేలు ఏ ముఖ్యమంత్రీ చేయలేదు.. దమ్ముంటే కాదని మీరు నిరూపించగలరా? అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీజేపీ నేతలకు ఛాలెంజ్ విసిరారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా రైతుల పంటకు కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారా.. చెప్పాలని ప్రశ్నించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం సీఎం కేసీఆర్‌ నిర్ణయాలను కొనియాడారన్నారు. కానీ, ఇక్కడ బీజేపీ నేతలు మాత్రం విమర్శిస్తున్నారని, ప్రజల్ని ఆదుకోవాల్సిన ఈ ఆపత్కాల సమయంలో రాజకీయాలు చేయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. సాధ్యమైతే సాయం చేయండి కానీ.. ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానుకోవాలని బీజేపీ నేతలను ఎర్రబెల్లి హెచ్చరించారు.

Tags: Bjp,Trs, Kcr, Modi, Errabelli, Lock down

Tags:    

Similar News