అక్టోబర్ 4న గురుకుల ప్రవేశ పరీక్ష
దిశ, న్యూస్ బ్యూరో : గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి ప్రవేశ పరీక్షను.. అక్టోబర్ 4వ తేదీన ఉ. 10 గం.ల నుంచి మ. 12 గం.ల వరకు నిర్వహిస్తున్నట్టు తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ప్రకటించింది. తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థచే నడుపబడుతున్న 35 గురుకుల జూనియర్ కళాశాలల్లోకి ప్రవేశ పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉమ్మడి జిల్లాల్లోని 10 కేంద్రాలు, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లోని పరీక్షాకేంద్రాల్లో నిర్వహించబడుతుందని తెలిపింది. మొత్తం 42,037 […]
దిశ, న్యూస్ బ్యూరో : గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి ప్రవేశ పరీక్షను.. అక్టోబర్ 4వ తేదీన ఉ. 10 గం.ల నుంచి మ. 12 గం.ల వరకు నిర్వహిస్తున్నట్టు తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ప్రకటించింది. తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థచే నడుపబడుతున్న 35 గురుకుల జూనియర్ కళాశాలల్లోకి ప్రవేశ పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉమ్మడి జిల్లాల్లోని 10 కేంద్రాలు, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లోని పరీక్షాకేంద్రాల్లో నిర్వహించబడుతుందని తెలిపింది. మొత్తం 42,037 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, అభ్యర్థులు తెదీ 24 సెప్టెంబర్ నుంచి సంస్థ వెబ్ సైట్ లో హాల్ టిక్కెట్లు పొందవచ్చని సంస్థ తెలిపింది.