సోషల్ మీడియాను బాయ్‌కాట్ చేయనున్న ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్
దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు పరిధిలోని జట్లన్నీ సోషల్ మీడియాను బాయ్‌కాట్ చేయనున్నాయి. ఇటీవల క్రీడాకారులపై పెరుగుతున్న జాతి వివక్ష, ఆన్‌లైన్ అవమానాలకు నిరసనగా ఫుట్‌బాల్ జట్టు సోషల్ మీడియా బ్లాకౌట్‌ను ప్రకటించింది. ఈ నిరసన కార్యక్రమంలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కూడా పాల్గొననున్నట్లు సీఈవో టామ్ హారిసన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు, 18 ఫస్ట్ క్లాస్ కౌంటీ జట్లు, 8 ప్రాంతీయ మహిళా జట్లతో పాటు ప్రొఫెషనల్ క్రికెటర్స్ […]
దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు పరిధిలోని జట్లన్నీ సోషల్ మీడియాను బాయ్‌కాట్ చేయనున్నాయి. ఇటీవల క్రీడాకారులపై పెరుగుతున్న జాతి వివక్ష, ఆన్‌లైన్ అవమానాలకు నిరసనగా ఫుట్‌బాల్ జట్టు సోషల్ మీడియా బ్లాకౌట్‌ను ప్రకటించింది. ఈ నిరసన కార్యక్రమంలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కూడా పాల్గొననున్నట్లు సీఈవో టామ్ హారిసన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు, 18 ఫస్ట్ క్లాస్ కౌంటీ జట్లు, 8 ప్రాంతీయ మహిళా జట్లతో పాటు ప్రొఫెషనల్ క్రికెటర్స్ అసోసియేషన్ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. ఇంగ్లాండ్ స్థానిక సమయం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 3.00 గంటల నుంచి సోమవారం అర్థరాత్రి 11.59 వరకు అన్ని సోషల్ మీడియా అకౌంట్లను స్విచ్చాఫ్ చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇటీవల ఇంగ్లాండ్ క్రికెటర్లపై పలువురు జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. మొయిన్ అలీ క్రికెటర్ కాకపోయి ఉంటే కచ్చితంగా టెర్రరిస్టు అయ్యే వాడంటూ తస్లీమా నస్రీన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.