టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

దిశ, స్పోర్ట్స్: చారిత్రాత్మక ఇంగ్లండ్, విండీస్ టెస్ట్ మ్యాచ్‌కు వేదికైన ఏజెస్ బౌల్ ప్రాంతంలో వర్షం ఆగిపోయింది. దీంతో లంచ్ అనంతరం అంపైర్లు టాస్‌కు ఇద్దరు కెప్టెన్లను ఆహ్వానించారు. తొలిసారి ఇంగ్లండ్ జట్టుకు నేతృత్వం వహిస్తున్న బెన్ స్టోక్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వరుసగా 51 టెస్టు మ్యాచ్‌లు ఆడిన స్టువర్ట్ బ్రాడ్‌ను ఈ మ్యాచ్‌లో ఎంపిక చేయలేదు. అతడి స్థానంలో మార్క్ వుడ్ జట్టులోకి వచ్చాడు. మరో అరగంటలో మ్యాచ్ ప్రారంభం కానుంది. తుది […]

Update: 2020-07-08 07:32 GMT

దిశ, స్పోర్ట్స్: చారిత్రాత్మక ఇంగ్లండ్, విండీస్ టెస్ట్ మ్యాచ్‌కు వేదికైన ఏజెస్ బౌల్ ప్రాంతంలో వర్షం ఆగిపోయింది. దీంతో లంచ్ అనంతరం అంపైర్లు టాస్‌కు ఇద్దరు కెప్టెన్లను ఆహ్వానించారు. తొలిసారి ఇంగ్లండ్ జట్టుకు నేతృత్వం వహిస్తున్న బెన్ స్టోక్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వరుసగా 51 టెస్టు మ్యాచ్‌లు ఆడిన స్టువర్ట్ బ్రాడ్‌ను ఈ మ్యాచ్‌లో ఎంపిక చేయలేదు. అతడి స్థానంలో మార్క్ వుడ్ జట్టులోకి వచ్చాడు. మరో అరగంటలో మ్యాచ్ ప్రారంభం కానుంది.

తుది జట్లు
ఇంగ్లండ్ : రోరీ బర్న్స్, డామ్ సిబ్లే, జో డెన్లీ, జాక్ క్రాలీ, బెన్ స్టోక్స్ (కెప్టెన్), ఓలీ పోప్, జాస్ బట్లర్ (వికెట్ కీపర్), డామ్ బెస్, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, జేమ్స్ అండర్సన్

వెస్టిండీస్ : జాన్ క్యాంప్‌బెల్, క్రెయిగ్ బ్రాత్‌వెయిట్, షమారా బ్రూక్స్, షాయ్ హోప్, రోస్టన్ చేజ్, జర్నానీ బ్లాక్‌వుడ్, షేన్ డోరిచ్ (వికెట్ కీపర్), జాసన్ హోల్డర్ (కెప్టెన్), అల్జారీ జోసెఫ్, కీమర్ రోచ్, షానోన్ గాబ్రియేల్

Tags:    

Similar News